T20 World Cup: హార్దిక్ పాండ్య స్థానంలో శివ‌మ్ డూబే..?

T20 World Cup: ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ (Mumbai Indians) కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) ఆట‌తీరు ఏమాత్రం బాగోలేదు. అటు కెప్టెన్‌గా ఇటు ప్లేయ‌ర్‌గా ఓట‌మిని చ‌విచూస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న టీ20 వ‌ర‌ల్డ్ కప్ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య‌కు బ‌దులు శివ‌మ్ డూబేను (shivam Dube) ఎంపిక చేయాల‌ని BCCI స‌న్నాహాలు చేస్తోంది.

సెలెక్ష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ శివ‌మ్ డూబే అయితే బాగుంటుంద‌ని అంటున్నార‌ట‌. ఈసారి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ క‌రీబియ‌న్ పిచ్‌పై జ‌ర‌గ‌బోతోంది కాబ‌ట్టి.. అలాంటి పిచ్‌కి డూబే బ్యాటింగ్ బాగా స‌రిపోతుంద‌ని వారు అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో యువ‌రాజ్ సింగ్ కూడా డూబేలాగే బాగా పెర్ఫామ్ చేసేవాడ‌ని డూబేను ఆకాశానికెత్తేస్తున్నారు. దాంతో ఇప్పుడు పాండ్య కెరీర్ ఆటంకంలో ప‌డేలా ఉన్న‌ట్లే ఉంది.

ఇలాంటి మ‌రిన్ని వార్త‌లు చ‌ద‌వడానికి చూడండి https://telugu.newsx.com/