Hanuman Jayanti: హ‌నుమంతుడు ఆ ప‌ర్వ‌తంలోనే సంచ‌రిస్తున్నారా?

Hanuman Jayanti: రామ భ‌క్తుడైన హ‌నుమంతుడికి క‌లియుగం అంతమ‌య్యే వ‌ర‌కు జీవించే ఉండే వ‌రం ద‌క్కింది. అయితే ఇప్పుడు ఆంజ‌నేయ స్వామి ఈ భూమి మీదే ఉన్నారా? ఉంటే ఎక్క‌డ ఉన్న‌ట్లు? మ‌హాభార‌తం ప్ర‌కారం ఆంజ‌నేయుడు గంధ‌మ‌ద‌న్ ప‌ర్వ‌తాల మ‌ధ్య సంచ‌రిస్తున్నార‌ట‌.

హిమాల‌యాల్లోని ఉత్త‌ర దిశ‌గా ఉన్నాయి ఈ గంధ‌మ‌ద‌న్ ప‌ర్వ‌తాలు. కుబేరుడి రాజ్యం ఈ గంధ‌మ‌ద‌న్ ప‌ర్వ‌తాల మ‌ధ్యే ఉండేద‌ట‌. ఇప్పుడు ఈ ప‌ర్వ‌తాలు టిబెట్ దేశంలో భాగం అయి ఉన్నాయి. ఇప్ప‌టికీ హ‌నుమంతుడు ఈ ప‌ర్వ‌తాల మ‌ధ్యే ఉంటూ రామ నామం జ‌పిస్తూ ఉన్నార‌ట‌. ఈ ప‌ర్వ‌తాల న‌డుమ ఉండే క‌మ‌ల స‌రోవ‌రం నుంచి ఆంజ‌నేయుడు క‌మ‌లాలు సేక‌రించి రోజూ వాటితో రాముడిని పూజిస్తున్నార‌ట‌. క‌ఠోర త‌పస్సు చేసిన వారికే ఈ ప‌ర్వతాల‌ను అధిరోహించే శ‌క్తి ఉంటుంద‌ట‌. అయితే ఈ ప‌ర్వతాల‌ను క‌నుగొనేందుకు ఎన్నో ప్ర‌య‌త్నాలు జ‌రిగిన‌ప్ప‌టికీ ఎవ్వ‌రికీ క‌నిపించ‌లేద‌ట‌.

గంధ‌మ‌ద‌న తీర్థం అనే ఆల‌యంలో రాముడి పాదాల అచ్చులు ఉన్నాయ‌ని ఇప్ప‌టికీ చెప్తుంటారు. ఈ ప్రాంతానికి ఏ వాహ‌నాలు కూడా వెళ్ల‌లేవు. రుషులు, మ‌హ‌ర్షులు, గంధ‌ర్వులు, అప్స‌ర‌స‌లు ఈ గంధ‌మ‌ద‌న ప‌ర్వ‌తాల్లోనే నివ‌సిస్తున్నార‌ని పురాణాలు చెప్తున్నాయి.