Spiritual: క‌ల‌లో పాములు క‌నిపిస్తున్నాయా?

చాలా మందికి క‌ల‌లో పాములు (snakes) క‌నిపిస్తుంటాయి. దాంతో ఉలిక్కిప‌డుతుంటారు. అస‌లు క‌ల‌లో పాములు కనిపిస్తే దేనికి సంకేతం? తెలుసుకుందాం..! (spiritual)

జ్యోతిష్య‌శాస్త్రం ప్ర‌కారం అస‌లు పాములు క‌ల‌లో క‌నిపిస్తే వాటి అర్థ‌మేంటంటే.. మీకు మాన‌సిక‌, శారీర‌క హీలింగ్ అవ‌స‌రమ‌ని సంకేత‌మిస్తోంది. జీవితంలో ఎంతో అల‌సిపోయి ఉన్నారు కాస్త మీ శ‌రీరానికి, మ‌న‌సుకు కాస్త బ్రేక్ ఇవ్వండి అని చెప్తోంద‌ట‌. మీరు జీవితంలో కొన్ని విష‌యాల‌కు భ‌య‌ప‌డుతున్నట్లు కూడా సంకేత‌మే. మీరు ఏదో స‌మ‌స్య నుంచి త‌ప్పించుకోవాల‌ని చూస్తున్నార‌ని సంకేతం ఇస్తోంది. లైంగిక ఆనందానికి పాములు పెట్టింది పేరు. వాటి ప్ర‌వ‌ర్త‌న‌, పాకే తీరు సెక్సువాలిటీని సూచిస్తుంది.

మీకు క‌ల‌లో పొడ‌వైన పాము క‌నిపిస్తే.. మీరు జీవితంలో స్ట్రాంగ్ బాండ్ కోరుకుంటున్నార‌ని అర్థం. అంతేకాదు.. మీకు క‌ల‌లో పాములు క‌నిపిస్తున్నాయంటే అది కొన్ని విష‌యాల్లో మీకు వార్నింగ్ ఇస్తున్న‌ట్లు అర్థం. అంటే.. అంద‌రినీ గుడ్డిగా న‌మ్మ‌ద్దు అనో.. లేక మీతో ఉంటూనే మీకు వెన్నుపోటు పొడవాల‌ని ఎవ‌రైనా చూస్తున్నార‌నో మీకు హెచ్చ‌రిక ఇస్తోంది. ఒక‌వేళ క‌ల‌లో పాము కుబుసం విడుస్తున్న‌ట్లు క‌నిపిస్తే.. మీరు కూడా జీవితంలో ఏదో మార్పు చూడ‌బోతున్నార‌ని అర్థం. అంటే పాత అల‌వాట్లు, పాత విష‌యాల‌ను ప‌క్క‌న‌పెట్టి కొత్త జీవితాన్ని మొద‌లుపెడ‌తారని సంకేత‌మిస్తున్న‌ట్లు. (spiritual)