పాత దుస్తులతో ఇల్లు అలుకుతున్నారా? అయితే స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు

Astrology: చాలా మంది పాత దుస్తులు ఏవ‌న్నా ఉంటే వాటితో ఇల్లు అలికేస్తుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్ర‌క‌రాం అలా ఇల్లు అలికితే అరిష్టం అని నిపుణులు చెప్తున్నారు. పాత దుస్తుల‌తో ఎందుకు ఇల్లు అల‌క‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందాం.

*పాత దుస్తుల్లో అవి వేసుకున్న వారి ఎనర్జీ అలాగే ఉంటుంది. ఎవ‌రి దుస్తుల‌నైతే తీసి అల‌క‌డానికి పెడ‌తారో వారి జీవితం కూడా అలాగే అయిపోతుంద‌ట‌.  అదృష్టం వ‌రించ‌కుండా ఎప్పుడూ వారి చుట్టూ నెగిటివిటీ ఉంటుంద‌ట‌.

*పాత దుస్తుల‌తో ఇల్లు తుడిస్తే ఆ ఇంట్లో వారు న‌లుగురి మ‌ధ్య‌లో ఉన్నా ఎప్పుడూ ఒంట‌రిగా ఫీల్ అవుతూ ఉంటార‌ట‌. అంతేకాదు.. ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య స‌మ‌స్య వేధిస్తూ ఉంటుంద‌ట‌.

*ఆ కుటుంబానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల‌పై కూడా ప్ర‌భావం చూపుతుంది.

*ఎవ‌రి దుస్తుల‌ను అయితే తుడిచే బ‌ట్ట‌గా వాడ‌తారో వారి జాత‌కంలో రాహువు బ‌ల‌హీనంగా ఉంటాడు. దాని వ‌ల్ల కెరీర్‌లో స‌మ‌స్య‌లు వ‌స్తాయి. వ్య‌క్తిగ‌త జీవితంలో కూడా ఎలాంటి సంతోషం ఉండ‌ద‌ట‌.

*పాత దుస్తులు ఏవైనా ఉంటే వాటిని దానం చేయ‌డం బెట‌ర్. లేదంటే ఇప్పుడు కొన్ని యాప్స్ ఉన్నాయి. వాటి ద్వారా మీ పాత దుస్తుల‌ను ఇస్తే వాటికి మీకు డ‌బ్బులు కూడా ఇస్తారు.

*కాక‌పోతే దానం చేసే ముందు మీ దుస్తుల‌ను ఉప్పు నీళ్ల‌లో నాన‌బెట్టి ఉతికి ఇవ్వండి. దీని వ‌ల్ల వేసుకున్న వారి ఎన‌ర్జీ అంతా తుడిచిపెట్టుకునిపోయి అవి కొత్త వాటిలాగే ఉంటాయి.