Mitchell Santner: జ‌డేజా వ‌ల్ల నాకు ఆడే అవ‌కాశం రావ‌డంలేదు

Mitchell Santner slams ipl management for lack of opportunities

Mitchell Santner: చెన్నై సూప‌ర్ కింగ్స్ లైన‌ప్‌లో ర‌వీంద్ర జ‌డేజా ఉండ‌టం వ‌ల్ల త‌న‌కు ఆడే అవ‌కాశాలు రావడంలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు కివి ప్లేయ‌ర్ మిచెల్ సాంట్న‌ర్. 2018లో ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో చేరిన మిచెల్ ఆరు సీజ‌న్ల‌లో కేవ‌లం 16 మ్యాచ్‌ల‌లో మాత్ర‌మే ఆడాడు.  మిచెల్ మొత్తం ఐపీఎల్ కెరీర్‌లో కేవ‌లం 67 ప‌రుగులు 14 వికెట్లు తీసాడు. ఈ సీజ‌న్‌లో ధ‌ర్మ‌శాల‌లో పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆడే అవ‌కాశం ద‌క్కింది. ఈ మ్యాచ్‌లో దాదాపు మూడు వికెట్లు తీసాడు. బ్యాటింగ్ చేసిన 11 ప‌రుగులు కూడా తీసాడు. వ‌రుస‌గా ఆడే అవ‌కాశం రాక‌పోవ‌డంతో ఫోక‌స్ కోల్పోతున్నాన‌ని మిచెల్ బాధ‌ప‌డుతున్నాడు. మ్యాచ్‌లో ఆడలేన‌ప్పుడు మ్యాచ్ లేన‌ప్పుడు శిక్ష‌ణ స‌మ‌యంలో ఇత‌ర క్రికెట‌ర్ల‌కు ట్రైనింగ్ ఇస్తుంటాన‌ని తెలిపాడు.