Donald Trump: పోర్న్ స్టార్‌కి డ‌బ్బు ఇచ్చి.. మోసాన్ని క‌ప్పిపుచ్చి..!

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌ముఖ పోర్న్ స్టార్ స్టార్మీ డ్యానియ‌ల్స్‌కు డ‌బ్బు చెల్లించిన‌ట్లు ప్రాసిక్యూట‌ర్ కోర్టులో వ్యాఖ్య‌లు చేయ‌డం షాకింగ్ అంశంగా మారింది. డ్యానియ‌ల్స్‌తో ట్రంప్ ఎఫైర్ పెట్టుకుని ఈ విష‌యం బ‌య‌టకు పొక్క‌కుండా 130,000 డాల‌ర్లు చెల్లించాడ‌ట‌. 2016 ఎన్నిక‌ల‌కు ముందు ఆమెకు డ‌బ్బు చెల్లించిన అంశాన్ని దాచి పెట్టి ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్ల‌ఘించార‌ని న్యూయార్క్ కోర్టులో ప్రాసిక్యూట‌ర్ వాద‌న‌లు వినిపించారు.  డ‌బ్బు చెల్లించిన మాట నిజ‌మే కానీ ట్రంప్ ప‌రువును కాపాడుకునేందుకే చెల్లించార‌ని ట్రంప్ త‌ర‌ఫు న్యాయ‌వాది తెలిపారు.

న్యూ యార్క్‌లోని లోవ‌ర్ మ్యాన్‌హాటెన్ కోర్టులో ఈ కేసుకు సంబంధించిన వాద‌న‌లు జ‌రుగుతున్నాయి. 2016 ఎన్నిక‌ల స‌మ‌యంలో ట్రంప్ డ్యానియ‌ల్స్‌కు డ‌బ్బు ఇచ్చి దానిని త‌ప్పుగా రికార్డుల్లో చూపించార‌ని ప్రాసిక్యూట‌ర్ ఆరోప‌ణ‌లు చేస్తుండ‌గా.. ఎన్నిక‌ల్లో గెలిచేందుకే ట్రంప్ ఆ డ‌బ్బు ఇచ్చార‌ని అందులో త‌ప్పేముంద‌ని ట్రంప్ త‌ర‌ఫు న్యాయ‌వాది వాద‌న‌లు వినిపించారు.