KL Rahul: అంద‌రిముందు రాహుల్‌ను తిట్టిన LSG య‌జ‌మాని

lsg owner sanjeev goenka slams kl rahul in front of everyone

KL Rahul: నిన్న జ‌రిగిన సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ వ‌ర్సెస్ ల‌ఖ్‌నౌ సూప‌ర్ జైంట్స్ మ్యాచ్‌లో స‌న్ రైజ‌ర్స్ అద్భుతంగా విజ‌యాన్ని సాధించింది. ల‌ఖ్‌నౌ సూప‌ర్ జైంట్స్ ఓడిపోవడంతో.. ఆ టీం ఓన‌ర్ సంజీవ్ గోయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను అంద‌రి ముందు తిట్టాడు. రాహుల్‌పై వేలెత్తి చూపుతూ సంజీవ్ గోయెంకా తిడుతుండ‌డంతో అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటివ‌న్నీ డ్రెస్సింగ్ రూంలో చూసుకోవాలి కానీ అంత‌మంది ముందు తిడితే ఓ స్టార్ క్రికెట‌ర్ ప‌రువు పోతుంది అన్న ఇంగిత‌జ్ఞానం కూడా లేదు అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.