Sachin Tendulkar: ముందే బ్యాటింగ్ చేసుంటే 300 బాదేవారేమో

Sachin Tendulkar lauds travis head and abhishek sharma

Sachin Tendulkar: నిన్న హైద‌రాబాద్ ఉప్ప‌ల్‌లో జ‌రిగింది మ్యాచ్ కాదు. ఓ విధ్వంసం అనే చెప్పాలి. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్.. ల‌ఖ్‌నౌ సూప‌ర్ జైంట్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్ రైజ‌ర్స్ అద్భుత విజ‌యాన్ని చోటుచేసుకుంది. ఓపెన‌ర్లు అయిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శ‌ర్మ‌లు మాత్ర‌మే ల‌ఖ్‌నౌ టార్గెట్‌ను ఛేదించి ఒక్క వికెట్ ప‌డ‌కుండా మ్యాచ్ అవ‌లీల‌గా గెలిచేసారు. దీనిపై మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ తెందుల్క‌ర్ స్పందించారు.

మ్యాచ్ స్టార్ట్ అయ్యేట‌ప్పుడే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ బౌలింగ్ కాకుండా బ్యాటింగ్ ఎంచుకుని ఉంటే స్కోర్ 300 వ‌ర‌కు పోయేద‌ని స‌చిన్ అన్నారు. ఇప్ప‌టికే ఐపీఎల్ సీజ‌న్‌లోనే రెండు సార్లు అత్య‌ధిక స్కోర్లు సాధించిన టీంగా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఉంది.