Spiritual: రంగులు మార్చే బొజ్జ గ‌ణ‌ప‌య్య‌..!

Hyderabad: దేవ‌ల‌యాల‌కు పెట్టింది పేరు త‌మిళ‌నాడు. ముక్కోటి దేవ‌త‌ల‌కు గుళ్లు క‌ట్టించి పెట్టుకున్న పుణ్య‌స్థ‌లం అది (spiritual). అక్కడి ప్ర‌తీ ఆల‌యం ప్రత్యేక‌మే. అయితే బొజ్జ గ‌ణ‌పయ్య కోసం క‌ట్టించిన ఓ ఆల‌య ప్ర‌త్యేకత గురించి మీకు తెలియాలి. త‌మిళ‌నాడులోని (tamilnadu) క‌న్యాకుమారి జిల్లాలో ఉన్న కేర‌ళ‌పురం గ్రామంలో ఉంది ఆ వినాయ‌క (lord ganesha) దేవాల‌యం. అతిశ‌య వినాయ‌గ‌ర్ కోవిళ్ అని పిలుస్తారు. అంటే మిరాకిల్ వినాయ‌క మందిరం అని అర్థం. ఇలా ఎందుకు పిలుస్తారంటే.. ప్ర‌తి ఆరు నెల‌ల‌కోసారి బొజ్జ గ‌ణ‌ప‌య్య తెలుపు నుంచి న‌లుపుకు మ‌ళ్లీ ఆరు నెల‌ల త‌ర్వాత న‌లుపు నుంచి తెలుపుకు మారిపోతార‌ట‌. (spiritual)

ఉత్త‌రాయ‌ణం అంటే మార్చి నుంచి జూన్ మ‌ధ్య‌లో వినాయ‌కుడి విగ్ర‌మం న‌లుపు రంగులో ఉంటుంది. ద‌క్షిణాయం అంటే జులై నుంచి ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు మ‌ళ్లీ తెలుపు రంగులోకి వ‌చ్చేస్తుంద‌ట‌. . 12వ శ‌తాబ్దంలో ఈ ఆల‌యాన్ని నిర్మించిన‌ప్ప‌టికీ ఇందులోని విగ్ర‌హాలు అంత‌కంటే పురాత‌న‌మైన‌వ‌ట‌. ఇందులోనే శివ‌య్య కోసం కూడా ఓ మందిరం కట్టించారు. కేర‌ళ స్టైల్‌లో ఈ ఆల‌యాన్ని నిర్మించారు. ఈ ఆల‌యంలో నాగ‌రాజు విగ్ర‌హాలు కూడా బోలెడు క‌నిపిస్తాయి. కానీ ప్ర‌తీ నాగ‌రాజు విగ్ర‌హం విభిన్నంగా ఉంటుంద‌ట‌. (spiritual)

ఈ ఆల‌యంలోని మ‌రో ప్ర‌త్యేక‌త ఏంటంటే.. బొజ్జ గ‌ణ‌ప‌య్య విగ్ర‌మం ఎలాగైతే రంగులు మారుతుందో ఈ ఆల‌యంలో ఉన్న బావిలోని నీరు కూడా రంగులు మారుతూ ఉంటుంద‌ట‌. పెళ్లి కాని వారికి, పిల్ల‌లు లేని వారికి ఈ ఆల‌యాన్ని ఒక్క‌సారి ద‌ర్శించుకుంటే కొన్ని నెల‌ల్లోనే పెళ్లి కావ‌డం, సంతానం క‌లగ‌డం వంటివి జరుగుతాయ‌ని భ‌క్తులు నమ్ముతారు. (spiritual)

adhisaya vinayaka alayam
adhisaya vinayaka alayam