YSRCP Manifesto: మేనిఫెస్టో రిలీజ్ చేసిన జ‌గ‌న్.. కొత్త‌గా ఏమిస్తున్నారు?

YSRCP Manifesto: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈరోజు త‌న మేనిఫెస్టోను ప్ర‌కటించారు. రెండు పేజీల‌తో కూడిన మేనిఫెస్టోను సీఎం రిలీజ్ చేసారు. విద్య‌, అమ్మ ఒడి, విద్యా కానుక‌, ఇంగ్లీష్ మీడియం అంశాల‌కు ప్రాధాన్య‌త ఇస్తూ మేనిఫెస్టోను రూపొందించిన‌ట్లు జ‌గ‌న్ తెలిపారు. 99 శాతం హామీలు నెరవేర్చామ‌ని.. DBT ద్వారా రూ.2.68 లక్షల కోట్లు, నాన్ DBT లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1.78 లక్షల కోట్లు, అమ్మఒడి పథకం ద్వారా రూ.26,067 కోట్లు, జగనన్న వసతి దీవెన పథకం ద్వారా రూ.12,609 కోట్లు, వైఎస్సార్ భరోసా కోసం రూ.34,378 కోట్లు ఖర్చు చేశామ‌ని జ‌గ‌న్ తెలిపారు. చేయ‌గ‌లిగేవే మేనిఫెస్టోలో చెప్తున్నామ‌ని చేయ‌లేనివి చెప్పి ప్ర‌జ‌ల‌ను మోసం చేయాల‌న్న ఉద్దేశం త‌న‌కు లేద‌ని పేర్కొన్నారు.

9 ముఖ్య హామీల‌తో కొత్త మేనిఫెస్టో ఇదే

విద్య‌

వైద్యం

వ్య‌వ‌సాయం

ఉన్న‌త విద్య‌

అభివృద్ధి

పేద‌లంద‌రికీ ఇళ్లు

నాడు – నేడు

మ‌హిళా సాధికార‌త‌

సామాజిక భ‌ద్ర‌త‌

చేయూత రూ.75 వేల నుంచి ల‌క్షా 50 వేల‌కు పెంపు

కాపు నేస్తం రూ.60 వేల నుంచి ల‌క్షా 20 వేల‌కు పెంపు

అమ్మ ఒడి రూ.15 వేల నుంచి రూ.17 వేల‌కు పెంపు

రెండు విడ‌త‌ల్లో రూ.3500 వ‌ర‌కు పెన్ష‌న్ పెంపు

కాపునేస్తం, ఈబీసీ నేస్తం ప‌థ‌కాలు కొన‌సాగింపు

వైఎస్సార్ సున్నా వ‌డ్డీ ప‌థ‌కం కొన‌సాగింపు

పేద‌లంద‌రికీ ఇళ్ల ప‌ట్టాలు

MIG గృహాల‌పై ప్ర‌త్యేక దృష్టి

ఈబీసీ నేస్తం కింద రూ.21 వేల వ‌ర‌కు కొన‌సాగింపు