Jagan: “రేపే ఎన్నిక‌లు అన్న‌ట్లు ప‌నిచేయండి”

Jagan: ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2024లో జర‌గ‌బోయే ఎన్నిక‌ల గురించి ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసుకున్నారు. ఏప్రిల్ 11న ఎన్నిక‌లు..మార్చి 13న ఫ‌లితాలు వెలువ‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు కేబినెట్ మీటింగ్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల‌తో అన్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఈ స‌మ‌యంలో చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని తెలుగు దేశం పార్టీ, జ‌న‌సేన పార్టీలు త‌ప్పుగా మాట్లాడితే వెంట‌నే ఆ వ్యాఖ్య‌ల‌ను తిప్పి కొట్టే విధంగా అలెర్ట్‌గా ఉండాల‌ని సూచించారు. అనుకున్న తేదీ కంటే 20 రోజుల ముందే ఎన్నిక‌లు రావ‌చ్చ‌ని ఎన్నిక‌లు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాల‌ని తెలిపారు.