Renu Desai: ఆ ఎంపీకి మ‌ద్ద‌తు కోసం డ‌బ్బు తీసుకున్నారా?

Renu Desai: న‌టి రేణూ దేశాయ్ త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల వ‌ల్ల ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలుస్తూ ఉంటారు. ఆమె రాజ‌కీయాల‌కు, రాజ‌కీయ అంశాల‌కు దూరంగా ఉంటారు. ఇప్ప‌టివ‌ర‌కు ఏ ఒక్క రాజ‌కీయ పార్టీకి మ‌ద్ద‌తు తెల‌పని రేణూ ఇప్పుడు.. భార‌తీయ జ‌న‌తా పార్టీ (BJP) నుంచి హైద‌రాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్న మాధ‌వీల‌త‌కు (Madhavi Latha) స‌పోర్ట్ చేస్తున్నారు.

చాలా కాలం త‌ర్వాత ఒక బ‌ల‌మైన మ‌హిళా నేత‌ను చూస్తున్నాను అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. అయితే మాధ‌వీల‌త‌కు స‌పోర్ట్ చేసేందుకు త‌న‌కు ఎవ‌రి నుంచి కూడా డ‌బ్బు అంద‌లేద‌ని.. జ‌స్ట్ చెప్పాల‌నిపించింద‌ని పేర్కొన‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భారతీయ జ‌న‌తా పార్టీ, తెలుగు దేశం పార్టీ, జ‌న‌సేన పార్టీలు కూట‌మిగా ఏర్ప‌డి ఎన్నిక‌ల బ‌రిలో దిగుతున్న సంగ‌తి తెలిసిందే. అందుకే తెలంగాణ‌లో రేణూ భార‌తీయ జ‌న‌తా పార్టీకి మ‌ద్ద‌తు ఇస్తోంద‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. త‌న‌పై మ‌రిన్ని వదంతులు రాక‌ముందే చెక్ పెట్టేసారు రేణు