రంజాన్ వేళ‌ క‌ఠిన ఉప‌వాసం.. అన్నద‌మ్ములు మృతి

Viral News: రంజాన్ పండ‌గ స‌మ‌యంలో ముస్లింలు రోజా (ఉప‌వాసం) ఉంటారన్న విష‌యం తెలిసిందే. ఉద‌యాన్నే న‌మాజ్‌కి ముందు కాస్త తింటారు. ఆ త‌ర్వాత రోజంతా ఏమీ తిన‌కుండా మ‌ళ్లీ సాయంత్రం న‌మాజ్ త‌ర్వాత తింటారు. అయితే ఇదే రంజాన్ ఉప‌వాసం వ‌ల్ల అన్న‌ద‌మ్ములు మృతిచెందిన ఘ‌ట‌న గోవాలో చోటుచేసుకుంది. గోవాకు చెందిన జుబేర్ ఖాన్, ఆఫాన్ ఖాన్ అనే అన్న‌ద‌మ్ములు రంజాన్ స‌మ‌యంలో క‌ఠిన ఉప‌వాసం చేసారు. రోజుకు ఒక ఖ‌ర్జూరం తింటూ జీవించారు. ఇలా నెల రోజుల పాటు చేయడంతో వారిద్ద‌రూ చ‌నిపోయారు.

ఆ ప‌క్క‌నే వారి త‌ల్లి కూడా స్పృహ కోల్పోయి ఉంది. అయితే రోజా అంటే ఇలాగే చేయాల‌ని వీరు ముగ్గురూ నిర్ణ‌యించుకున్నార‌ట‌. అలా చేయకూడ‌ద‌ని.. అది అస‌లు నియ‌మం కాద‌ని తండ్రి ఎంత చెప్పినా వారు విన‌క‌పోవ‌డంతో ఆయ‌న‌కు కోపం వ‌చ్చి కొంత‌కాలం పాటు వేరుగా ఉంటున్నారు. ఇటీవ‌ల ఇంటికి వెళ్లి త‌లుపు త‌ట్ట‌డంతో ఎవ్వ‌రూ త‌లుపు తీయ‌లేదు. అనుమానంతో తలుపులు బ‌ద్ధ‌లు కొట్టి చూడ‌గా ముగ్గురూ విగ‌త‌జీవులుగా క‌నిపించారు. ఇద్ద‌రు పిల్లలు చ‌నిపోగా.. భార్య మాత్రం హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతోంది.

ఆ ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు ఎలా చనిపోయారు అన్న విష‌యాన్ని పోలీసులు ద‌ర్యాప్తు చేపట్ట‌గా నిన్ననే కేసు ఓ కొలిక్కి రావడంతో గోవా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వారు ఎలా చ‌నిపోయారో వివ‌రించారు.