లేడీ డాక్టర్స్ చికిత్స చేస్తేనే బతుకుతారట
Doctor: మగ డాక్టర్లు చికిత్స చేసే పేషెంట్ల కంటే లేడీ డాక్టర్లు చికిత్స చేసే పేషెంట్లే ఎక్కువ కాలం బతుకుతున్నారని ఓ రీసెర్చ్‌లో తేలింది. ఆనల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన విడుదల చేసిన నివేదిక ప్రకారం.. పేషెంట్లకు లేడీ డాక్టర్లు ఇచ్చే చికిత్స వల్ల వారు కోలుకోవడంతో పాటు బతికి బయటపడుతున్నారట. 2016 నుంచి 2019 మధ్యలో అడ్మిట్ అయిన 7,76,000 మంది పేషెంట్లపై ఈ స్టడీ చేసారు. వీరిలో 458,100 ఆడ పేషెంట్లు, 318,800 మగ పేషెంట్లు ఉన్నారు. వీరిపై చేసిన రీసెర్చ్‌లో తేలింది ఏంటంటే.. త్వరగా కోలుకుని బతికి బయటపడ్డ వారికి లేడీ డాక్టర్లే చికిత్స చేసారట. ఎవరైతే కోలుకోలేక చనిపోయారో వారికి మగ డాక్టర్లు చికిత్స చేసినట్లు రీసెర్చ్‌లో తేలింది.
లేడీ డాక్టర్లు పేషెంట్ల్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారని.. ఎక్కువ కేర్ తీసుకుంటారని కూడా ఈ రీసెర్చ్‌లో తేలింది. కాబట్టి ఎక్కువగా లేడీ డాక్టర్లు, ఫిజీషియన్లను ఎంపిక చేయడం వల్ల పేషెంట్లు వారి బాధలను ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నారని కూడా అంటున్నారు. మరో విషయం ఏంటంటే.. పేషెంట్‌కు ఉన్న రోగాన్ని గుర్తించామా చికిత్స అందించామా అన్నట్లు కాకుండా ఎప్పటికప్పుడు వారి రిపోర్ట్స్ చూస్తూ వారితో ఎక్కువ సేపు టైం స్పెండ్ చేస్తుంటారట. దీని వల్ల పేషెంట్లకు సాంత్వన కలుగుతోందని స్టడీలో తేలింది.
ALSO READ