హ‌స్త‌ప్ర‌యోగం: ఆడ‌వాళ్లు చేసుకోవ‌చ్చా?

masturbation myths

Masturbation: హ‌స్త‌ప్ర‌యోగం అనేది మీకు మీరు లైంగిక ఆనందాన్ని ఇచ్చుకునే ప్ర‌క్రియ‌. హ‌స్త‌ప్ర‌యోగం ఎవ‌రైనా చేసుకోవ‌చ్చు. అందులో ఎలాంటి త‌ప్పు లేదు. కాక‌పోతే మీ ప‌రిధిలో.. మీ ప‌ర్స‌నల్ స్పేస్‌లో ఉండాలే త‌ప్ప న‌లుగురికీ ఇబ్బంది క‌లిగించేలా బ‌హిరంగ ప్ర‌దేశాల్లో చేసుకోవ‌డం వంటివి నేరం. అయితే.. ఈ హ‌స్త‌ప్ర‌యోగం చుట్టూ కొన్ని అపోహ‌లు అల్లుకుని ఉన్నాయని అంటున్నారు సెక్స్ ఎడ్యుకేట‌ర్ జ‌యా జైస్వాల్. ఇంత‌కీ ఏంటా అపోహ‌లు? తెలుసుకుందాం.

హ‌స్త‌ప్ర‌యోగం కేవ‌లం వ‌య‌సులో ఉన్న యువ‌తీ యువ‌కులే చేసుకోవాలా?

ఇది చాలా మందికి ఉండే అపోహ‌. అలా ఏమీ లేదు. ఏ వ‌య‌సు వారైనా చేసుకోవ‌చ్చు.

అమ్మాయిలు హ‌స్త‌ప్ర‌యోగం చేసుకోకూడ‌దా?

నా ద‌గ్గ‌రికి వ‌చ్చే చాలా మంది పేషెంట్ల ఈ ప్ర‌శ్న అడుగుతుంటారు. ఇది కేవ‌లం అపోహ‌. ఆడ‌వాళ్ల‌కు మాత్రం కోరిక‌లు ఉండ‌వా?

హ‌స్త‌ప్ర‌యోగం చేసుకుంటే జుట్టు రాలుతుందా?

హ‌స్త‌ప్ర‌యోగానికి జుట్టుకి అస్సలు సంబంధం లేదు.

హ‌స్త‌ప్ర‌యోగం వ‌ల్ల శ‌రీరంపై అవాంచిత‌రోమాలు మొలుస్తాయా?

చాలా మంది ఈ భ‌యంతోనే హ‌స్త‌ప్ర‌యోగం చేసుకోకుండా ఉంటారు. అవాంచిత‌రోమాలు వంటివి రావు.

పీరియ‌డ్స్ స‌మ‌యంలో చేసుకోవ‌చ్చా?

త‌ప్ప‌కుండా చేసుకోవ‌చ్చు. పీరియ‌డ్స్ వ‌ల్ల క‌లిగే నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

హ‌స్త‌ప్ర‌యోగం వ‌ల్ల జ‌న‌నాంగాల్లో మార్పులు వ‌స్తాయా?

లేదు.