Chandrababu Naidu: మోదీ ప్ర‌త్యేక హోదా త‌ప్ప అన్నీ ఇచ్చారు

Chandrababu Naidu:  ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (Narendra Modi) ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా తప్ప అన్నీ ఇచ్చార‌ని తెలిపారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు.  ఈసారి చంద్ర‌బాబు నాయుడు జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీల‌తో క‌లిసి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. చంద్ర‌బాబు నాయుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు.. కేంద్రాన్ని ప్ర‌త్యేక హోదా అడిగితే ఇవ్వ‌లేద‌ని.. అలాంటి కేంద్రంలో మ‌ళ్లీ ఎందుకు పొత్తు పెట్టుకున్నార‌ని ప్ర‌శ్నించ‌గా.. దానికి చంద్ర‌బాబు ఇలా స‌మాధానం ఇచ్చారు.

“” ప్ర‌ధాని న‌రేంద్ర మోదీది 2047 విజ‌న్. అదే విజన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌తో పాటు భార‌తీయులకు, అంత‌ర్జాతీయంగా ఉన్న భార‌తీయులకు మంచి చేస్తుంది. అందుకే ఆయ‌న‌తో పొత్తు పెట్టుకున్నాం. మీరు అన్న‌ట్లు మోదీ ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేదు. కానీ నేను సీఎంగా ఉన్న‌ప్పుడు అడిగిన‌వ‌న్నీ ఇచ్చారు. పోల‌వ‌రానికి నిధులు విడుద‌ల చేస్తే 70% పూర్తి చేసాను. అమ‌రావ‌తికి ఎలాంటి అభ్యంత‌రాలు వ్య‌క్తం చేయ‌కుండా నిధులు ఇచ్చారు. ఐఐటి, ఐటీ వంటి ఎన్నో కాలేజ్‌లు ఇచ్చారు. ఒక్క ప్ర‌త్యేక హోదా మాత్ర‌మే ఇవ్వ‌లేదు. దాని కోసం నేను ఎంతో ప్ర‌య‌త్నించాను “” అని తెలిపారు.

ALSO READ:

చంద్ర‌బాబుని న‌మ్మ‌కండి.. జూనియ‌ర్ ఎన్టీఆర్ మామ షాకింగ్ కామెంట్స్

AP Elections: వీడిన స‌స్పెన్స్.. చింత‌మ‌నేనికి చంద్ర‌బాబు ఫోన్