బాత్రూమ్లోనే ఎక్కువ గుండెపోటు కేసులు ఎందుకు?
Health: మీరు గమనించి ఉంటే.. ఓ పెద్దాయన గుండెపోటుతో చనిపోయార్రా.. బాత్రూమ్లోనే కుప్పకూలిపోయాడట అనే మాటలు వినే ఉంటారు. ఈ గుండెపోటులు, కార్డియాక్ అరెస్ట్లు ఎక్కువగా బాత్రూమ్లోనే వస్తుంటాయి. ఇందుకు కారణం ఏంటి?
మల విసర్జన సమయంలో లేదా స్నానం చేస్తున్న సమయంలోనే ఈ హార్ట్ ఎటాక్ ఎక్కువగా వస్తుందట. ఎందుకంటే ఆ సమయంలోనే గుండె ఒత్తిడికి గురవుతుందని వైద్యులు చెప్తున్నారు. మల విసర్జన సమయంలో బలవంతంగా ముక్కడం వల్ల గుండెపై ఒత్తిడి పడుతుందట. ఆల్రెడీ గుండె సంబంధిత వ్యాధులు ఉంటే మాత్రం వారికి ఇంకా రిస్క్ ఎక్కువ.
వేగస్ అనే నరంపై ఒత్తిడి పడటం వల్ల బాత్రూమ్కి వెళ్లినప్పుడు వాసోవాగల్ రెస్పాన్స్ వస్తుందట. ఈ వేగస్ అనే నరంపై ఒత్తిడి పడితే గుండెకు రక్త ప్రసరణ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక స్నానం చేస్తున్న సమయంలో మరీ చల్ల నీటితో లేదా మరీ వేడి నీటితో స్నానం చేయడం వల్ల గుండె ధమనులపై ఒత్తిడి పడుతుంది.
మలబద్ధక సమస్యతో బాధపడేవారు, నీళ్లు ఎక్కవగా తాగని వారికి గుండె సమస్యలు ఎక్కువగా వస్తాయి. మంచి ఆహారం, వ్యాయామం లేకపోయినా సమస్యే అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి మరిన్ని వార్తలు చదవడానికి చూడండి https://telugu.newsx.com/