టీలో బిస్కెట్లు ముంచి తినేస్తున్నారా? అయితే జాగ్ర‌త్త‌!

Health: చాలా మందికి టీ తాగేట‌ప్పుడు బిస్కెట్ల‌ను టీలో ముంచి తినడం అల‌వాటు. ఇప్పుడు ప్ర‌త్యేకించి టీలో న‌లుచుకునేందుకు కొత్త ర‌క‌మైన బిస్కెట్లు కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇలా టీలో బిస్కెట్లు ముంచి తిన‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు అని అంటున్నారు నిపుణులు. అసలు టీలో బిస్కెట్లు నలుచుకుని తిన‌డం వ‌ల్ల క‌లిగే ఇబ్బందులు ఏంటో తెలుసుకుందాం.

అధిక కేలొరీలు – సాధార‌ణంగా పాల‌తో చేసే టీలోనే కేలొరీలు ఎక్కువ‌గా ఉంటాయి. ఇక చాయ్‌లో బిస్కెట్లు న‌లుచుకుంటే కేలొరీలు అధికం అవుతాయి. పైగా బిస్కెట్ల‌లో చెక్క‌ర‌, అనారోగ్య‌క‌ర‌మైన కొవ్వు ఎక్కువ‌గా ఉంటాయి. ఫ‌లితంగా బ‌రువు పెరుగుతారు.

బ్ల‌డ్ షుగ‌ర్ – టీలో మీరు చెక్క‌ర వేసుకోక‌పోయినా అందులో ముంచి తినే బిస్కెట్లకు త‌ప్ప‌నిస‌రిగా ఎంతో కొంత చెక్క‌ర ఉంటుంది. దీని వ‌ల్ల బ్ల‌డ్ షుగ‌ర్ పెరిగే అవ‌కాశం ఉంది. డ‌యాబెటిస్, థైరాయిడ్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి ఈ బిస్కెట్ల‌తో ముప్పు ఎక్కువ‌.

గుండెపై ప్ర‌భావం – 25 గ్రాముల బిస్కెట్ ప్యాకెట్ల‌లో 0.4 గ్రాముల ఉప్పు ఉంటుంది. కాబ‌ట్టి ఇలాంటి బిస్కెట్లు తింటే బ్లడ్ ప్రెష‌ర్ విప‌రీతంగా పెరిగిపోతుంది. ఎక్కువ సోడియం తిన‌వ‌డం ఒంట్లో నీటి శాతం త‌గ్గిపోయి శ‌రీరం ఉబ్బిపోతుంది. (Health)

ప‌ళ్ల స‌మ‌స్య‌లు – దంతాల‌కు కూడా ఇబ్బందే. త‌ర‌చూ చెక్క‌ర ఎక్కువున్న బిస్కెట్లు తిన‌డం వ‌ల్ల ప‌ళ్లు త్వ‌ర‌గా పాడైపోయే ప్ర‌మాదం ఉంది.

రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌గ్గిపోతుంది – చెక్క‌ర క‌లిపే డ్రింక్స్, బిస్కెట్ల వ‌ల్ల రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌గ్గిపోతుంది.

మ‌ల‌బ‌ద్ధ‌కం – బిస్కెట్ల‌ను ఎక్కువ‌గా మైదా పిండితో త‌యారుచేస్తారు. మైదా వైట్ పాయిజ‌న్‌తో స‌మానం. రోజూ టీలో బిస్కెట్ల‌ను ముంచి తిన‌డం వ‌ల్ల మైదా పేగుల్లో పేరుకుపోయి మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

ఆక‌లి మంద‌గిస్తుంది – టీలో బిస్కెట్లు న‌లుచుకుని తిన‌డం వ‌ల్ల ఇంకా ఎక్కువ బిస్కెట్లు తినాల‌పిస్తుంది. దాంతో ఆక‌లి మంద‌గిస్తుంది. ఇదే కొన‌సాగితే పోష‌కాహారానికి దూర‌మై అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కొనితెచ్చుకున్న‌వారు అవుతారు. కాబ‌ట్టి త‌స్మాత్ జాగ్ర‌త్త‌..!