Sanju Samson: ఆ ఒక్క అబ‌ద్ధంతో IPL ఎంట్రీ ద‌క్కింది

that one lie paved me a way to ipl says sanju samson

Sanju Samson: స్టార్ క్రికెట‌ర్ రాహుల్ ద్రావిడ్‌కి చెప్పిన ఒక్క అబ‌ద్ధంతో తాను ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాన‌ని అన్నాడు సంజు సాంస‌న్. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్‌గా ఉన్న సంజు సాంస‌న్.. శ్రీశాంత్, రాహుల్ ద్ర‌విడ్ వ‌ల్లే త‌న‌కు ఐపీఎల్‌లో అవ‌కాశం ద‌క్కింద‌ని తెలిపాడు. 2009లో ఐపీఎల్ వేలంలో ఉన్న ఆట‌గాళ్ల‌లో ఒక‌రిగా ఉన్నాడు సంజు. మూడేళ్ల నిరీక్ష‌ణ త‌ర్వాత అత‌న్ని క‌ల‌క‌త్తా నైట్ రైడ‌ర్స్ తీసుకుంది. అయితే 2012లో టైటిల్ కొట్టిన క‌ల‌క‌త్తా నైట్ రైడ‌ర్స్.. అత‌ని ఆట‌తీరు చూడ‌కుండానే రిలీజ్ చేసేసింది.

అదే స‌మ‌యంలో శ్రీశాంత్‌ని క‌లిసి త‌న ఆట‌ను నిరూపించుకునే అవ‌కాశం రావ‌డంలేదు అని చెప్పుకున్నాడ‌ట‌. ఆ స‌మ‌యంలో శ్రీశాంత్.. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్‌ను క‌లిసి.. “” ఓ కేర‌ళ‌ కుర్రాడు ఉన్నాడు. లోక‌ల్ టోర్న‌మెంట్‌లో ఒకే ఓవ‌ర్‌లో 6 సిక్సులు బాదేసాడు. అత‌నికి మ‌నం క‌చ్చితంగా అవ‌కాశం క‌ల్పించాలి “” అని అబ‌ద్ధం చెప్పాడ‌ట‌.

అలా 2013లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ సంజు సాంస‌న్‌ను తీసుకుంది. అక్క‌డి నుంచి త‌న ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రుస్తూ ఇప్పుడు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్ స్థాయికి ఎదిగాడు సాంస‌న్. అలా శ్రీశాంత్ చెప్పిన ఓ చిన్న అబ‌ద్ధంతో ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాన‌ని గుర్తుచేసుకున్నాడు సంజు సాంస‌న్.