Irfan Pathan: ధోనీకి ఎవ‌రైనా చెప్పండి.. ఇలా వర్క‌వుట్ అవ్వ‌దు

Irfan Pathan slams ms dhoni for batting at 9th order

Irfan Pathan: మాజీ క్రికెట‌ర్, కమెంటేట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్‌.. ఎంఎస్ ధోనీపై మండిప‌డ్డారు. నిన్న జ‌రిగిన పంజాబ్ కింగ్స్.. చెన్నై సూప‌ర్ కింగ్స్ మ్యాచ్‌లో చెన్నై గెలిచింది. కానీ ఇక్క‌డ మ్యాట‌ర్ చెన్నై గెల‌వ‌డం కాదు. ధోనీ 9వ పొజిష‌న్‌లో ఆడి డ‌క‌వుట్ అవ్వ‌డం. మొత్తం మ్యాచ్ మొత్తంలో చెన్నై గెలిచింద‌న్న సంతోషం కంటే ధోనీ డ‌క‌వుట్ అయ్యాడు అనేదే చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

దీనిపై ఇర్ఫాన్ ప‌ఠాన్ స్పందిస్తూ.. “” ధోనీ 9వ పొజిష‌న్‌లో ఆడ‌టం ఏంటి అని ప్రశ్నించారు. ద‌య‌చేసి ఎవ‌రైనా ధోనీకి చెప్పండి. అత‌ను సీనియ‌ర్ ఆట‌గాడు. 4 లేదా 5వ ఇన్నింగ్‌లో ఆడాలి. అంతేకానీ 9వ ఇన్నింగ్‌లో ఆడితే టీంకి ఎంతో న‌ష్టం. గ‌తంలో కొన్ని కీల‌క సంద‌ర్భాల్లో ధోనీ 9వ పొజిష‌న్‌లో ఆడాడు. ఇప్పుడు కూడా అలాగే ఆడ‌తానంటే కుద‌ర‌దు. టీంలో అత్యంత సీనియ‌ర్ స్టార్ ప్లేయ‌ర్ అయివుండి ఏ పొజిష‌న్‌లో ఆడాలో డిసైడ్ అవ్వ‌క‌పోతే ఎంతో క‌ష్టం. ఎవ‌రైనా ఈ విష‌యం ధోనీకి అర్థ‌మ‌య్యేలా చెప్పండి “” అని తెలిపారు.