Dhanush: 10 గంట‌లు చెత్త కుప్ప‌లోనే..!

Actor Dhanush dedicatedly filmed for over 10 hours near a garbage dump in Mumbai

Dhanush:  ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు ధ‌నుష్ సినిమా ప‌ట్ల ఎంత నిబ‌ద్ధ‌త ఉందో చెప్పేందుకు ఈ ఒక్క ఘ‌ట‌న చాటు. ప్ర‌స్తుతం ఆయ‌న కుబేరా (Kubera) సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం ముంబైలో జ‌రుగుతోంది. అయితే ఈ సినిమాలోని ఓ కీల‌క స‌న్నివేశంలో భాగంగా చెత్త కుప్ప వ‌ద్ద సీన్‌ను షూట్ చేయాల్సి ఉంది. ఇందుకోసం ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా ప‌ది గంట‌ల పాటు ధ‌నుష్ చెత్త కుప్ప‌లోనే ఉన్నార‌ట‌. మాస్క్ వేసుకునేందుకు కూడా ఆయ‌న నిరాక‌రించాడు. మాస్క్ వేసుకుని చేస్తే స‌న్నివేశం రియ‌లిస్టిక్‌గా రాదంటూ ప‌ది గంట‌ల పాటు చెత్త కుప్ప‌లోనే గ‌డిపారు ధ‌నుష్‌.