పిల్ల‌లు పుట్టాక సెక్స్ మంచిదేనా? ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Health: చాలా మందికి పిల్ల‌లు పుట్టాక శృంగారంలో పాల్గొన‌వ‌చ్చా లేదా అనే సందేహం క‌లుగుతుంది. పిల్ల‌లు పుట్ట‌క ముందు వ‌ర‌కు సెక్స్ లైఫ్ బాగానే ఉంటుంది. పుట్టాక కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఇందుకు ఎన్నో కార‌ణాలు ఉన్నాయి. పిల్ల‌లు పుట్టాక కూడా సెక్స్ లైఫ్‌ని ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలి? వంటి విష‌యాల‌ను తెలుసుకుందాం.

గ‌ర్భం దాల్చాక శ‌రీరంలో చాలా మార్పులు వ‌స్తాయి. విప‌రీతంగా లావు అయిపోతారు. ఒక‌ప్పుడు సులువుగా చేసుకునే ప‌నుల‌ను కూడా చేసుకోలేక‌పోతారు. వ‌క్షోజాల సైజులో మార్పులు వ‌స్తాయి. స్ట్రెచ్ మార్క్స్ ప‌డ‌తాయి. దీని వ‌ల్ల మ‌హిళ‌లు అత్మన్యూన‌తా భావానికి గుర‌వుతుంటారు. పిల్ల‌లు పుట్టాక ఈ మార్పులు స‌హ‌జ‌మే అనుకుంటే ఫ‌ర్వాలేదు. కానీ వీటిని నెగిటివ్‌గా చూస్తే మాత్రం డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయే ప‌రిస్థితి వ‌స్తుంది.

పిల్ల‌లు పుట్టాక యోని భాగంలో విప‌రీత‌మైన నొప్పి ఉంటుంది. ఈ నొప్పి త‌గ్గి సాధార‌ణ స్థితికి రావాలంటే కాస్త స‌మ‌యం ప‌డుతుంది. విప‌రీత‌మైన నీర‌సం, నొప్పి, హార్మోన‌ల్ ఇమ్‌బ్యాలెన్స్ అవుతుంటాయి. అందుకే సెక్స్‌లో పాల్గొనాల‌ని అనిపించ‌దు. పిల్ల‌లు పుట్టాక క‌లిగే హార్మోన‌ల్ ఇమ్‌బ్యాలెన్స్ వ‌ల్ల సెక్స్ కోరిక‌లు కూడా త‌గ్గిపోతాయి. యోని భాగం పూర్తిగా పొడిబారిపోయి ఉంటుంది. దీని వ‌ల్ల ఇన్‌స‌ర్ష‌న్ స‌మ‌యంలో విప‌రీత‌మైన నొప్పి క‌లిగి నో అనేస్తుంటారు.

మ‌రేం చేయాలి?

*ముందు మీ శ‌రీరం ఎలా ఉన్నా దానిని స్వీక‌రించేందుకు య‌త్నించండి. మిమ్మ‌ల్ని మీరు ప్రేమించుకోండి.

*క‌ల‌యిక విష‌యంలో ఎలాంటి సిగ్గు, భ‌యం లేకుండా మీకు ఏమ‌నిపిస్తోందో.. ఎలా ఫీల్ అవుతున్నారో మీ పార్ట్‌న‌ర్‌కు వివ‌రించండి

*నేరుగా ఇన్‌స‌ర్ష‌న్ కాకుండా ముద్దు, హ‌గ్స్, చేతులు ప‌ట్టుకోవ‌డం వంటి రొమాంటిక్ ట‌చ్‌ని ప్రాక్టీస్ చేయండి.

*యోని భాగంలోని కండ‌రాలు బ‌ల‌ప‌డ‌టానికి పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ప్రాక్టీస్ చేస్తే ఎంతో మేలు. లేదంటే మీకు తెలిసిన గైనిక్‌ను సంప్ర‌దిస్తే వారు టిప్స్ చెప్తారు.