Health: ప్రశాంతమైన జీవితం కావాలా?
Health: ప్రశాంతమైన జీవితం కావాలని ఎవరు మాత్రం కోరుకోరు? కానీ ఇప్పుడున్న రోజుల్లో బతికుంటే చాలురా బాబూ అనేలా ఉన్నాయి చాలా మంది పరిస్థితులు. అయితే జీవితంలో మనం చేసుకున్న చిన్న చిన్న మార్పులతో మనకు కావాల్సిన ప్రశాంతత తప్పకుండా దొరుకుతుంది అని అంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.
ధ్యానం (meditation)
ఎప్పుడూ చెప్పేదే అని విసుక్కోకండి. ధ్యానానికి ఉన్న పవర్ మాటల్లో చెప్పలేనిది. మీ జీవితంలో ధ్యానాన్ని అలవర్చుకుని చూడండి. మార్పు మీకే తెలుస్తుంది. ఒక 15 నిమిషాల పాటు ధ్యానం చేస్తే మన శరీరంలోని హ్యాపీ హార్మోన్స్ అయిన ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్ విడుదల అవుతాయి. ఆటోమేటిక్‌గా మనసు సంతోషంగా, ప్రశాంతంగా ఉంటుంది.
టాక్సిక్ బంధాలకు గుడ్‌బై చెప్పండి (toxic relationships)
ప్రేమ బంధం అయినా లేదా సాధారణ స్నేహ బంధమైనా మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంటే ఆ బంధానికి గుడ్ బై చెప్పడమే మంచిది. మీకు సంతోషం, ధైర్యాన్ని ఇవ్వలేని బంధాలు ఎన్ని ఉన్నా ఏ ఉపయోగం ఉంది చెప్పండి. ఇలాంటివారికి దూరంగా ఉండటమే మీకు మీ ఆరోగ్యానికి మంచిది.
ఓపిక (patience)
మనిషికి ఓపిక అనేది ఎంతో అవసరం. ఓపిక లేకపోతే జీవితంలో ఏదీ సాధించలేం. ఓర్పు సహనంతోనే అన్నీ సాధ్యం అవుతాయి. అయితే ఆ ఓపికను సహనాన్ని ఎంత వరకు వాడాలో కూడా తెలిసుండాలి.
మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి (love yourself)
ప్రేమ అనగానే మనం ఇతరులపై చూపించడం గురించి మాట్లాడుతుంటాం. కానీ వారిని వీరిని కాదు ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. అది చాలా ముఖ్యం. మీ శారీరక, మానసిక ఆరోగ్యంపై దృష్టిపెట్టండి. ఆ తర్వాత ఇతరుల గురించి ఆలోచించవచ్చు.