527 భారతీయ వస్తువుల్లో క్యాన్సర్ కారకాలు..!
Health: భారతదేశానికి చెందిన 527 వస్తువుల్లో క్యాన్సర్ కారకాలను గుర్తించినట్లు యూరోపియన్ యూనియన్ వెల్లడించింది. ర్యాపిడ్ అలర్ట్ సిస్టమ్ ఫర్ ఫుడ్ అండ్ ఫీడ్ (RASFF) డేటా ప్రకారం యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల్లో ఎక్కువగా భారతీయ వస్తువులను వాడుతున్నారని వాటిలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని గుర్తించారు. ఆ వస్తువుల్లో ఎక్కువగా నువ్వులు, మసాలాలు ఉన్నట్లు గుర్తించారు. 2020 సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు భారతదేశం నుంచి ఎగుమతి అయిన 87 కన్‌సైన్మెంట్లను యూరోపియన్ దేశాలు తిరస్కరించాయి. ఈ 527 వస్తువుల్లో 332 వస్తువులు భారత్‌లోనే తయారవుతున్నాయట. ఇతర దేశాల్లో తయారవుతున్న ఉత్పత్తుల విషయంలో కూడా నోటీసులు పంపారు.
ఈ వస్తువుల్లో ఎక్కువగా ఎథిలీన్ ఆక్సైడ్‌ను వాడుతున్నట్లు తేలింది. ఎథిలీన్ ఆక్సైడ్ ఒక రంగులేని గ్యాస్. దీనిని పెస్టిసైడ్, స్టెర్లింగ్ ఏజెంట్‌గా వాడతారు. ఎక్కువగా ఈ ఎథిలీన్ ఆక్సైడ్ వాడిన వస్తువులు వినియోగిస్తే లుకేమియా, లింఫోమా వంటి క్యాన్సర్లు వస్తాయి. ఈ ఎథిలీన్ ఆక్సైడ్ బ్యాక్టీరియా, వైరస్‌ను చంపడంలో దిట్ట. అందుకే దీనినే ఎక్కువగా వాడుతున్నారు.
ALSO READ