Ambati Rayudu: జ‌న‌సేన జెండా ప‌ట్టుకుని రోడ్డుపై నిలబ‌డ‌మంటారా?

Ambati Rayudu:  ప్ర‌ముఖ క్రికెట‌ర్ అంబ‌టి రాయుడుని జ‌న‌సేన (Janasena) స్టార్ క్యాంపెయిన‌ర్ల‌లో ఒక‌రిగా నియ‌మించింది. ఇప్ప‌టికే హైప‌ర్ ఆది, ఆటో రాంప్ర‌సాద్, గెట‌ప్ శ్రీను, జానీ మాస్ట‌ర్‌లు కూడా ప‌వ‌న్ కోసం ప్ర‌చారం చేస్తున్నారు. అయితే అంబ‌టి రాయుడు మాత్రం ఎక్క‌డా గ్రౌండ్‌లో ప్ర‌చారం చేస్తున్న‌ట్లు క‌నిపించ‌డంలేదు.

దీనిపై ఓ ప్ర‌ముఖ వెబ్‌సైట్ రాయుడుకి ప్ర‌చారం చేయ‌డం ఇష్టం లేద‌ని.. అలాంటి వ్య‌క్తిని ఎందుకు జ‌న‌సేనా పార్టీ ఆహ్వానించిందో అర్థంకావ‌డంలేద‌ని రాసారు. ఆ వెబ్‌సైట్ ఆర్టిక‌ల్‌కు రాయుడు మూతి పగిలేలా రిప్లై ఇచ్చారు. “” నేను జ‌న‌సేన కోసం ప్ర‌చారం చేసేందుకు సిద్ధ‌మే. కానీ ప్లాన్ ఆఫ్ యాక్ష‌న్ ఏంటో చెప్పాలి కదా. లేదంటే నేను జ‌న‌సేన జెండా ప‌ట్టుకుని రోడ్ల‌పై నిల‌బ‌డ‌మంటారా ఏంటి? “” అని రిప్లై ఇచ్చారు.

అంబ‌టి రాయుడు త‌న రాజ‌కీయ జీవితాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో మొదలుపెట్టారు. ఆ పార్టీలో చేరి గుంటూరు ఎంపీ టికెట ఆశించగా.. అందుకు పార్టీ ఒప్పుకోలేదు. పైగా కొన్ని కోట్ల రూపాయ‌లు ఇస్తే అప్పుడు టికెట్ ఇస్తాం అని వైఎస్సార్ కాంగ్రెస్ పెద్ద‌లు చెప్పార‌ట‌. అది న‌చ్చ‌క అంబ‌టి రాంబాబు పార్టీకి రాజీనామా చేసి జ‌న‌సేన‌తో చేతులు క‌లిపారు.

ALSO READ:

YSRCP నుంచి త‌ప్పుకోమ‌ని రాయుడుకి చెప్పింది ఎవ‌రు?