Jagan: మీరు వైఎస్సార్‌కు పుట్టారా లేక చంద్ర‌బాబుకా?

Jagan: వైఎస్ జగ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న చెల్లెళ్లు వైఎస్ ష‌ర్మిళ (YS Sharmila), సునీతా రెడ్ల‌పై (YS Sunitha Reddy) మండిప‌డ్డారు. ఈరోజు పులివెందుల నుంచి నామినేష‌న్ వేసిన జ‌గ‌న్ .. నామినేషన్ ప్రక్రియ పూర్త‌య్యాక ప్ర‌సంగించారు. వైఎస్ వివేకానంద రెడ్డికి (YS Vivekananda Reddy) రెండో కుటుంబం ఉంద‌న్న విష‌యం ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌ని.. చంపిన వాడు నేనే చంపాను అని ఒప్పుకున్నా కూడా అత‌నికే మ‌ద్ద‌తు ఇస్తున్న వీళ్లా వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి వార‌సులు అని ప్ర‌శ్నించారు.

తండ్రి చ‌నిపోయాక కూడా ఆయ‌న పేరును సీబీఐ లిస్ట్‌లో చేర్చిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మ‌ద్ద‌తు ఇస్తున్న ష‌ర్మిళ వైఎస్సార్ వార‌సురాలు ఎలా అవుతుంద‌ని అన్నారు.  వ‌య‌సులో చాలా చిన్న‌వాడైన అవినాష్ రెడ్డిపై ఆరోప‌ణ‌లు చేసి అత‌నికి రాజ‌కీయ భ‌విష్య‌త్తు లేకుండా చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. అస‌లు ష‌ర్మిళ వైఎస్ కుటుంబానికి పుట్టారా లేక చంద్ర‌బాబు నాయుడుకు పుట్టారా అని ఎద్దేవాచేసారు. చంద్ర‌బాబు నాయుడుని గెలిపించాల‌ని చూస్తున్న వీరిద్ద‌రూ వైఎస్ వార‌సులు ఎలా అవుతారు అని నిల‌దీసారు.

ALSO READ:

ప‌వన్ ఎంత మందికి క‌డుపులు చేసాడో అఫిడ‌విట్‌లో చెప్పాలి

AP Elections: ఎవ‌రి ద‌గ్గ‌ర ఎన్ని వాహ‌నాలున్నాయో తెలుసా?