హాస్పిట‌ల్ బిల్లు కట్ట‌లేక భార్య‌ను చంపేసాడు..!

man kills wife as he could not afford hospital bills

Viral News: అనారోగ్యంతో భార్య హాస్పిట‌ల్‌లో బాధ‌ప‌డుతుంటే.. ఆమె చికిత్స‌కు అయ్యే ఖ‌ర్చు భ‌రించ‌లేక ఆమెనే చంపేసాడు ఓ భ‌ర్త‌. ఈ ఘ‌ట‌న అమెరికాలో చోటుచేసుకుంది. మిస్సోరీ ప్రాంతానికి చెందిన విగ్స్ అనే వ్య‌క్తి కిడ్నీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న త‌న భార్య‌ను హాస్పిట‌ల్‌లో చేర్పించాడు. ఆమెకు డ‌యాలసిస్ చేయించాల‌ని వైద్యులు చెప్పారు. వారం రోజుల పాటు డ‌యాల‌సిస్ నిర్వ‌హించ‌గా.. ఆ త‌ర్వాత చేయించ‌డానికి విగ్స్ వ‌ద్ద డ‌బ్బులు లేవు. దాంతో ఏం చేయాలో తెలీక ఎవ్వ‌రూ లేని స‌మ‌యంలో ముక్కు నోరు మూసేసి ఆమెను చంపేసాడు. ఆ త‌ర్వాత విగ్స్ హాస్పిట‌ల్ నుంచి పారిపోయాడు. అనుమానం రావ‌డంతో విగ్స్ కుమారుడు అత‌న్ని వెతికి ప‌ట్టుకుని పోలీసుల ముందు హాజ‌రుప‌రిచాడు. దాంతో విగ్స్ తానే చంపేసానని నిజం ఒప్పుకున్నాడు. దాంతో పోలీసులు అత‌న్ని అరెస్ట్ చేసారు.