Ambati Rambabu: నా పిల్ల‌ల్ని నాకు కాకుండా చేసారు… నా తండ్రి చివ‌రి కోరిక తీర్చ‌లేక‌పోయాను

Ambati Rambabu son in law slams for telling lies against him

Ambati Rambabu: వైఎస్సార్ కాంగ్రెస్ మంత్రి అంబ‌టి రాంబాబు అల్లుడు గౌత‌మ్ మ‌రో షాకింగ్ వీడియో బ‌య‌ట‌పెట్టారు. త‌న వెనుక చంద్ర‌బాబు నాయుడు, న‌రేంద్ర మోదీ, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉన్నార‌ని అంబ‌టి రాంబాబు అంటుంటే న‌వ్వొస్తోంద‌ని.. త‌న పిల్ల‌ల్ని త‌న‌కు కాకుండా చేసి ఆయ‌న నాట‌కాలు ఆడుతున్నార‌ని మండిప‌డ్డారు.

త‌న తండ్రి చివ‌రి క్ష‌ణాల్లో మ‌న‌వ‌డిని మ‌న‌వ‌రాలిని చూడాల‌ని ఉంద‌ని త‌పించార‌ని.. ఆ వీడియోను అంబ‌టి రాంబాబుకు పంపితే క‌నీసం క‌నిక‌రించ‌లేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేసారు. త‌న తండ్రి చివ‌రి కోరిక‌ను తీరకుండానే ఆయ‌న చ‌నిపోయార‌ని తెలిపారు. అలాంటిది ఈరోజు త‌న పిల్ల‌ల్ని త‌న నుంచి ర‌క్షించుకుంటున్నాన‌ని అంబ‌టి రాంబాబు అబ‌ద్ధాలు ఆడుతున్నార‌ని.. ఆయ‌న అబ‌ద్ధాలు వింటుంటే.. ఒక్క క్ష‌ణం పాటు అంబ‌టి మంచివారు అని తానే న‌మ్మేసాన‌ని వెల్ల‌డించారు. రేపు మీడియా సాక్షిగా త‌న పిల్ల‌ల్ని తాను తీసుకెళ్లాల‌ని అనుకుంటున్నాన‌ని.. అందుకు అంబ‌టి రాంబాబు ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు.