రోజూ మ‌త్తుమందు ఇస్తూ… కుటుంబ స‌భ్యుల‌తో సెక్స్ చేయాలంటూ..

man forces wife to have sex with family members

Viral News: రాజ‌స్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. భార్య‌కు మ‌త్తు మందు ఇచ్చి కుటుంబంలోని మ‌గ‌వారితో శృంగారం చేయాలంటూ భ‌ర్త టార్చ‌ర్ పెట్టాడు. దాంతో ఆ యువ‌తి పారిపోయి పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. చురు జిల్లాకు చెందిన ఓ మ‌హిళ త‌న‌కు పెళ్లైన‌ప్ప‌టి నుంచి దాదాపు 20 ఏళ్లుగా త‌న‌కు ఉత్ప్రేర‌కాలు ఇస్తున్నాడ‌ని.. న‌లుగురు పిల్ల‌ల్ని క‌న్నాక కూడా ఎలాంటి మార్పు రాలేద‌ని పోలీసుల ముందు క‌న్నీరుపెట్టుకుంది. ఇంట్లో ఉంటున్న మామ‌గారు, మ‌రిది ద‌గ్గ‌రకు పంపి వారి లైంగిక వాంఛ‌లు తీర్చార‌ని టార్చ‌ర్ పెట్టేవాడ‌ని.. ఒప్పుకోక‌పోతే గొడ్డును బాదిన‌ట్లు బాదేవాడ‌ని పేర్కొంది. ఓసారి క‌త్తితో చంప‌బోతే పారిపోయి త‌ప్పించుకున్నాన‌ని తెలిపింది. ఇన్నాళ్లూ పిల్ల‌ల ముఖం చూసి ఏమీ అన‌కుండా అన్నీ భ‌రించాన‌ని.. ఇక త‌న వ‌ల్ల కాక‌పోవ‌డంతో ఫిర్యాదు చేస్తున్నాన‌ని వెల్ల‌డించింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు మ‌హిళ భ‌ర్త‌తో పాటు మామ‌గారిని, మ‌రిదిని అదుపులోకి తీసుకున్నారు.