Shane Watson: KKR కి గెలిచే అర్హ‌త కూడా లేదు

shane watson slams kkr for winning match with MI

Shane Watson: నిన్న జ‌రిగిన ముంబై ఇండియ‌న్స్ వ‌ర్సెస్ క‌ల‌క‌త్తా నైట్ రైడ‌ర్స్ మ్యాచ్‌లో (MI vs KKR) క‌ల‌క‌త్తా మ్యాచ్ తొలి ద‌శ‌లోనే ఐదు వికెట్లు కోల్పోయింద‌ని.. అస‌లు మ్యాచ్ గెలిచే అర్హ‌త కూడా లేద‌ని మండిప‌డ్డారు ప్ర‌ముఖ ఆస్ట్రేలియ‌న్ క్రికెట‌ర్ షేన్ వాట్స‌న్. ప‌న్నెండేళ్లుగా వాంఖెడె స్టేడియంలో ఎప్పుడు క‌ల‌క‌త్తాకి ముంబై ఇండియ‌న్స్‌కి మ‌ధ్య మ్యాచ్ జ‌రిగినా ముంబై ఇండియ‌న్సే గెలుస్తూ వ‌చ్చింది. అలాంటిది నిన్న జ‌రిగిన మ్యాచ్‌లో క‌ల‌క‌త్తా వాంఖెడెలో గెలిచేసింది.

దీనిపై వాట్స‌న్ మండిప‌డ్డాడు. “” అస‌లు క‌ల‌క‌త్తా నైట్ రైడర్స్‌కి ముంబైపై గెలిచే హ‌క్కు కూడా లేదు. తొలి ఓవ‌ర్ల‌లోనే ఐదు వికెట్లు కోల్పోయి ఎలా గెలుస్తుంది? మ్యాచ్ స‌మ‌యంలో బ్యాటింగ్, బౌలింగ్ విష‌యంలో క‌ల‌క‌త్తా తీసుకున్న నిర్ణ‌యాలు కూడా వారికి క‌లిసొచ్చాయి. శ్రేయ‌స్ అయ్య‌ర్ కెప్టెన్సీలో ఈ విజ‌యం ఇప్పుడు క‌ల‌క‌త్తాకు మ‌రింత కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇలాంటి ఘ‌ట‌న‌ల్లో తాము స‌రిగ్గా ఆడ‌టం లేదు అని తెలిసినా సులువుగా గెలిచేస్తాం అనే ధీమాను క‌లిగిస్తుంది “” అని తెలిపారు వాట్స‌న్