Dale Steyn: ఓడిపోవ‌డం.. నోటికొచ్చినట్లు వాగ‌డం.. పాండ్య‌పై ఫైర్

Dale Steyn: నిన్న జ‌రిగిన ముంబై ఇండియ‌న్స్ వ‌ర్సెస్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (MI vs RR) మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ మ‌రోసారి ఓడిపోయింది. అయితే మ్యాచ్ త‌ర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడుతూ.. త‌ప్పులు జ‌రుగుతూ ఉంటాయ‌ని.. వాటిని స‌రిదిద్దుకుని ముందుకు వెళ్లాలని అన్నాడు. దీనిపై సౌత్ ఆఫ్రికాకు చెందిన మాజీ పేసర్ డేల్ స్టైన్ స్పందిస్తూ పాండ్య‌పై మండిప‌డ్డారు. మ్యాచ్ ఓడిపోవ‌డం.. న‌వ్వ‌డం.. నోటికొచ్చిన‌ట్లు వాగ‌డం.. ఇదే రిపీట్ చేయ‌డం అంటూ పాండ్య తీరుపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

“” ఎప్పుడూ చెప్పే సోది కాకుండా ఆట‌గాళ్లు నిజాయ‌తీగా త‌మ మ‌న‌సులోని మాట‌ల‌ను ఎప్పుడు బ‌య‌ట‌పెడ‌తారా అని ఎదురుచూస్తున్నా. మ్యాచ్ ఓడిపోగానే న‌వ్వ‌డం.. చెప్పిందే చెప్ప‌డం.. మ‌ళ్లీ ఇదే చెత్త రిపీట్ చేయడం “” అంటూ డేల్ స్టైన్ ట్వీట్ చేసారు.

ALSO READ:

హార్దిక్ పాండ్య ఏం కెప్టెనో ఏమో.. న‌బీ మండిపాటు

T20 World Cup: హార్దిక్ పాండ్య స్థానంలో శివ‌మ్ డూబే..?