Mohammad Nabi: హార్దిక్ పాండ్య ఏం కెప్టెనో ఏమో.. న‌బీ మండిపాటు

Mohammad Nabi: ముంబై ఇండియ‌న్స్ (Mumbai Indians) కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్య‌పై (Hardik Pandya) అస‌లే మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (Rohit Sharma) ఫ్యాన్స్ పీక‌ల‌దాకా కోపంగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ముంబై ఇండియ‌న్స్ కీల‌క ఆట‌గాడు మ‌హ్మ‌ద్ న‌బీ అగ్గికి ఆజ్యం పోసిన‌ట్లు వ్య‌వ‌హ‌రించారు. మొన్న జ‌రిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య అఫ్గాన్ ఆట‌గాడు అయిన న‌బీ చేత బౌలింగ్ వేయించ‌లేద‌ట‌. ఈ విష‌యం గురించి న‌బీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ అస‌హ‌నం వ్య‌క్తం చేసారు.

“” కొన్నిసార్లు కెప్టెన్లు తీసుకునే నిర్ణ‌యాలు స‌ర్‌ప్రైజింగ్‌గా ఉంటాయి. న‌బీ అసలు బౌలింగ్ వేయ‌లేదు. రెండు క్యాచ్‌లు ప‌ట్టి ర‌నౌట్ చేసిన గేమ్ ఛేంజ‌ర్ చేత బౌలింగ్ వేయించ‌లేదు “” అని పోస్ట్ చేసాడు. అయితే ఆ పోస్ట్‌ని కాసేప‌టికే న‌బీ డిలీట్ చేసాడు. కానీ అప్ప‌టికే అది వైర‌ల్ అయిపోయింది. దాంతో హార్దిక్‌పై ట్రోలింగ్ మ‌రింత పెరిగిపోయింది. దీనిపై ముంబై ఇండియ‌న్స్ కానీ హార్దిక్ పాండ్య కానీ ఇంకా స్పందించ‌లేదు.

ALSO READ:

T20 World Cup: హార్దిక్ పాండ్య స్థానంలో శివ‌మ్ డూబే..?

రుతుకి ఉన్న సపోర్ట్ హార్దిక్‌కి లేక‌పోవ‌డం బాధాక‌రం