Money plant ఇలా పెడితే ఆర్థిక క‌ష్టాలు త‌ప్ప‌వు

Money plant: ఇంట్లో మ‌నీ ప్లాంట్‌ను ఎక్క‌డ ప‌డితే అక్క‌డ పెట్ట‌కూడ‌దు. దీనికి వాస్తు టిప్స్ పాటించాల్సిందే. లేదంటే ఆర్థిక క‌ష్టాలు త‌ప్ప‌వు అంటున్నారు నిపుణులు. మ‌నీ ప్లాంట్ ఇంట్లో పెట్టుకునే స‌మ‌యంలో ఎలాంటి నియ‌మాలు పాటించాలో తెలుసుకుందాం.

మ‌నీ ప్లాంట్‌లో ఈశాన్య మూలలో అస్స‌లు పెట్ట‌కూడ‌దు. దీని వ‌ల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వ‌స్తాయి

ఆగ్నేయ దిశ‌గా పెట్టుకుంటే మంచిది. ఇది వినాయ‌కుడి స్థానం.

ఇంట్లో మ‌నీ ప్లాంట్ పెరుగుతోందంటే.. ఇంట్లో వారు కూడా అభివృద్ధి చెందుతున్నార‌ని అర్థ‌మ‌ట‌. మొక్క ఆకులు ఎప్పుడూ కూడా నేల‌కు తాక‌కూడ‌దు.

ఆకులు ఎప్పుడూ వాడిపోకూడ‌దు. ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలిస్తూ నీళ్లు పోస్తూ ఉండాలి.

ఎండిపోయిన మ‌నీ ప్లాంట్ ఇంట్లో ఉంచ‌డం మంచిది కాదు

మ‌నీ ప్లాంట్స్‌ని బ‌య‌ట పెట్ట‌కండి. వాస్తు ప్రకారం వీటిని బ‌య‌ట పెడితే నెగిటివ్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది.

మీ ఇంట్లో ఉన్న మ‌నీ ప్లాంట్‌ని ఇత‌రుల‌కు డ‌బ్బుకు కానీ ఉచితంగా కానీ ఇచ్చేయ‌కండి. మంచిది కాదని వాస్తు శాస్త్రం చెప్తోంది.