Menopause: ఆ స‌మ‌స్య మ‌గ‌వారికీ ఉంటుంది..!

Menopause: మెనోపాజ్ అన‌గానే ఆడ‌వారికి మాత్ర‌మే అవుతుంది అనుకుంటారు. 40 నుంచి 50 ఏళ్లు వ‌చ్చేస‌రికి ఎప్పుడైతే రుతుక్ర‌మం ఆగిపోతుందో ఆ ద‌శ‌ను మెనోపాజ్ అంటారు.  అయితే ఈ మెనోపాజ్ అనేది ఆడ‌వారికే కాదు మ‌గ‌వారికీ అవుతుంద‌ట‌. ఎలాగైతే ఆడ‌వారికి రుతుక్ర‌మం ఆగిపోతే వారికి మెనోపాజ్ ద‌శ మొద‌లైంద‌ని అంటారో అదే విధంగా మ‌గ‌వారిలో టెస్టోస్టిరోన్ లెవెల్స్ పడిపోతే వారికి కూడా ఆ ద‌శ మొదలైన‌ట్లే. దీనిని ఆండ్రోపాజ్ అంటారు. 60 ఏళ్లు వ‌చ్చేస‌రికి ప్ర‌తి 10 మంది మ‌గ‌వారిలో ఇద్ద‌రికి ఈ ఆండ్రోపాజ్ స‌మ‌స్య ఉన్న‌ట్లు నివేదిక‌లో వెల్ల‌డైంది.

30 ఏళ్ల త‌ర్వాత ఈ టెస్టోస్టిరోన్ లెవెల్స్ ఏడాదికి ఒక శాతం త‌గ్గిపోతుంటాయి. అప్పుడు సెక్స్ కోరిక‌లు త‌గ్గిపోవ‌డం.. అంగం స్తంభించ‌డం వంటి స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. ఇదేం పెద్ద భ‌య‌ప‌డాల్సిన విష‌యం కాదు. వ‌య‌సు పెరిగే కొద్ది ఇలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. 30 ఏళ్ల నుంచే స‌రైన ఆహార‌పు అల‌వాట్లు పాటిస్తూ.. స‌రైన వ్యాయామాలు చేస్తుంటే ఈ స‌మ‌స్య‌ను 80% వ‌ర‌కు త‌గ్గించ‌వ‌చ్చ‌ని వైద్యులు సూచిస్తున్నారు.