Betel leaf: త‌మ‌ల‌పాకు చెట్టు ఇంట్లో ఉండ‌చ్చా?

Betel leaf: తమ‌ల పాకును ఎంతో శుభ‌ప్ర‌దంగా భావిస్తుంటాం. ఇంట్లో జ‌రిగే శుభ‌కార్యాల్లో ఈ త‌మ‌ల‌పాకు ఉండి తీరాల్సిందే. మ‌రి ఈ ప‌విత్రమైన మొక్క‌ను ఇంట్లో పెంచుకోవ‌చ్చా? పెంచ‌డం వ‌ల్ల లాభాలు ఉంటాయా? లేక న‌ష్టాలా?

త‌మ‌ల‌పాకు అంటుంటాం కానీ నిజానికి త‌మ‌లపాకు అస‌లు పేరు నాగ‌వ‌ల్లి. చండీ హోమం చేసేట‌ప్పుడు ఉవాచ‌ల‌ను త‌మ‌ల‌పాకుల‌తోనే ఇస్తారు. తాంబూలంలో కూడా త‌మ‌ల‌పాకులే ఇస్తారు. త‌మ‌ల‌పాకు అనేది గౌర‌వ‌ప్ర‌ద‌మైన‌ది. దైవీక శ‌క్తులు క‌లిగిన‌ది. రావి, వేప‌, ఉసిరి చెట్ల కంటే ఎంతో ప‌వ‌ర్‌ఫుల్ ఈ త‌మ‌ల‌పాకు అని శాస్త్రంలో ఉంది. మ‌నం ఏద‌న్నా నివేద‌న చేయాల‌న్నా ముందు త‌మ‌లపాకుతోనే చేయాలి. ఒక దీపాన్ని పెట్టాలంటే కింద త‌మ‌ల‌పాకు వేసి పెడుతుంటారు. ఇది చాలా త‌ప్పు. నిజానికి త‌మ‌ల‌పాకును అస‌లు కింద పెట్ట‌కూడ‌దు. ముందు వ‌రిపిండితో ముగ్గువేసి దానిపై కాసిన్ని బియ్యం లేదా అక్షింత‌లు వేసి దానిపై త‌మ‌ల‌పాకు పెట్టి దీపం పెట్టాలి. అంతేకానీ నేరుగా త‌మ‌ల‌పాకును నేత‌ల‌పై పెట్టి దీపం పెట్ట‌కూడ‌దు. (Betel Leaf)

ఇక త‌మ‌ల‌పాకును ఇంట్లో పెంచుకోవ‌చ్చా అంటే పెంచుకోవచ్చు. కాక‌పోతే ఎంతో జాగ్ర‌త్త‌గా చూసుకునే ఓపిక నిబ‌ద్ధ‌త ఉంటేనే ఆ మొక్కను పెంచుకోవాల‌ట‌. ఎప్పుడ ప‌డితే అప్పుడు ఆకులు కోసేయ‌డం.. ఏ నీళ్లు ప‌డితే ఆ నీళ్ల‌ను చ‌ల్లేయ‌డం వంటివి చేస్తే అరిష్టం. కాబ‌ట్టి ప‌విత్రంగా చూసుకునే వీలు ఉంటేనే త‌మ‌ల‌పాకును ఇంట్లో వేసుకోండి. లేదంటే లేనిపోని స‌మస్య‌లు వస్తాయి.