YS Jagan: ఓడిపోతాన‌ని ఒప్పేసుకున్న‌ట్లేనా?

ys jagan says he is losing trust on election procedure

YS Jagan: జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిలో ఓట‌మి భ‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఆయ‌న నిన్న చేసిన కామెంట్స్ అలాగే ఉన్నాయి. నాకు ఎన్నికలు బాగా జరుగుతాయి అనే నమ్మకం రోజు రోజుకి సన్నగిల్లుతోంది. డబ్బులు ఆపేస్తున్నారు… అధికారుల్ని ఇష్టానుసారంగా మారుస్తున్నారు అని జ‌గ‌న్ నిన్న వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ కోసం ప‌నిచేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌తో ఎన్నిక‌ల సంఘం ప‌లు పోలీస్ అధికారుల‌ను బ‌దిలీ చేసి వారి స్థానంలో కొత్త వారిని నియ‌మించింది. దీని గురించి జ‌గ‌న్ స్పందిస్తూ.. ఎన్డీయే కూట‌మికి స‌పోర్ట్ చేసే అధికారుల‌ను తీసుకొచ్చార‌ని ఆయ‌న ప‌రోక్షంగా కామెంట్స్ చేసారు. ఒక‌వేళ రేపు ఎన్నిక‌ల్లో ఓడిపోయినా ఇదే అంశాన్ని లేవ‌నెత్త‌చ్చు అని ఇప్ప‌టి నుంచే జ‌గ‌న్ ప్రిపేర్ అవుతున్న‌ట్లున్నారు.