తిన్న వెంటనే నీళ్లు ఎందుకు తాగకూడదు?
తిన్న వెంటనే నీళ్లు తాగకూడదని అంటుంటారు. ఇలాగైతే జరగాల్సిన జీర్ణ ప్రక్రియ సరిగ్గా జరగదని.. దాని వల్ల అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయని చెప్తుంటారు. తిన్న వెంటనే కనీసం ఒక గ్లాసు నీళ్లు తాగాలని చెప్పేవాళ్లు కూడా ఉన్నారు. అసలు ఈ రెండింట్లో ఏది కరెక్ట్? తిన్న వెంటనే నీళ్లు తాగాలా వద్దా?
రీసెర్చ్‌లో తేలింది ఏంటంటే.. మనం తిన్న తర్వాత తీసుకున్న ఆహారం నెమ్మదిగా బ్రేక్ డవున్ అవుతుంది. అంటే మన తీసుకున్న ఆహారంలోని మినరల్స్, విటమిన్స్ వంటివి రక్తంలో నెమ్మదిగా కలిసిపోతుంటాయి. ఈ ప్రక్రియ సహజంగానే జరిగిపోతుంది. కానీ తిన్న వెంటనే నీళ్లు తాగితే ఆ ప్రక్రియ వేగంగా జరిగిపోయి త్వరగా తీసుకున్న ఆహారం పెద్ద పేగుల్లోకి చేరిపోతుంది. ఇలా అయితే తీసుకున్న ఆహారంలోని పోషకాలు శరీరానికి సరిగ్గా అందవు.
ఇలా తిన్న వెంటనే నీళ్లు తాగేస్తే జీర్ణ ప్రక్రియ వేగంగా జరిగిపోయి త్వరగా ఆకలేస్తుంది. ఫలితంగా ఎక్కువ తినేస్తుంటారు. దీని వల్ల బ్లోటింగ్ సమస్యలు వస్తాయి. అంటే కడుపు ఉబ్బరంగా ఉంటుంది. కొన్ని సార్లు తిన్న వెంటనే నీళ్లు తాగేస్తే ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు. తద్వారా అందులో ఉన్న గ్లూకోజ్ కొవ్వుగా మారిపోతుంది. ఒకవేళ తినే సమయంలో నీళ్లు తాగాలనిపిస్తే తినడానికి అరగంట ముందు కానీ తిన్న అరగంట తర్వాత కానీ తాగితే మంచిది.