బొప్పాయితో డెంగ్యూ దూరం

బొప్పాయి పండులో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా రక్తకణాల వృద్ధిలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. డెంగ్యూ వంటి జ్వరాల బారిన పడినప్పుడు ప్లేట్​లెట్స్​ సంఖ్య తగ్గకుండా ఉండాలంటే బొప్పాయిని తినాలని వైద్యులు సైతం సూచిస్తున్నారు. బొప్పాయి తినడం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
* బొప్పాయిలో విటమిన్‌ సి, యాంటీఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. భోజనం తర్వాత బొప్పాయి తింటే ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. పొట్ట, పేగుల్లో విషపదార్థాల్ని ఇది తొలగిస్తుంది. బొప్పాయిలోని ప్లేవనాయిడ్స్‌, పొటాషియం, మినరల్స్‌, కాపర్‌, మెగ్నిషియం, ఫైబర్‌ వంటి పోషకాలు మనకు ఎంతో మేలు చేస్తాయి. డెంగీ ఫీవర్‌తో బాధపడేవారికి ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. అలాంటి వారు తప్పనిసరిగా బొప్పాయి తినాలి. ఫలితంగా ప్లేట్ లెట్స్ మళ్లీ వేగంగా పెరుగుతాయి. బొప్పాయి ఆకుల రసం తాగినా చక్కటి ఫలితం ఉంటుంది.
* బొప్పాయిలో క్యాలరీలు తక్కువే. అందువల్ల ఎక్కువగా తిన్నా బరువు పెరిగే ప్రమాదం ఉండదు. పైగా… ఇది చెడు కొవ్వును తరిమేస్తుంది. గుండెకు రక్తం చక్కగా సరఫరా అయ్యేలా చేస్తుంది. మూత్ర పిండాల్లో రాళ్లు ఉండేవారికి బొప్పాయి సరైన మందు. బొప్పాయి క్రమం తప్పకుండా తింటే, మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను అరికట్టవచ్చు.
* కోలన్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటివి కూడా తగ్గుతాయి. అంతే కాదు పళ్ళు కళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి బొప్పాయి ఉపయోగపడుతుంది. నారింజ, ఆపిల్‌లో కంటే బొప్పాయిలో ఎక్కువగా విటమిన్ ఈ ఉంటుంది. అలసట, నీరసం వంటి అనారోగ్య సమస్యల్ని బొప్పాయి తొలగిస్తుంది.
* బొప్పాయిని తినడం వల్ల కళ్లు చల్లగా, ఆరోగ్యంగా ఉంటాయి. బీపీ, షుగర్ ఉన్నవాళ్లు కూడా బొప్పాయి తింటే మంచి ఫలితం ఉటుంది. నారింజ, యాపిల్‌ కంటే బొప్పాయిలో విటమిన్‌ ఇ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మన స్కిన్ సున్నితంగా, మృదువుగా, కోమలంగా మారడానికి బొప్పాయి ఉపయోగపడుతుంది.
* చక్కెర, ఖనిజ లవణాలు అధికంగా ఉండే ఈ పండు పైత్యాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని తొలగిస్తుంది. గుండెకు ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయి కాయను కూరగా వండి తీసుకుంటే బాలింతలకు మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. బొప్పాయి పాలు, బెల్లంతో కలిపి తినిపిస్తే చిన్నారుల కడుపులో ఉండే నులి పురుగులు నశిస్తాయి
* నీళ్ల విరేచనాలకు బొప్పాయి పండు బాగా పనిచేస్తుంది. కడుపునొప్పితో నీళ్ల విరేచనాలు మొదలైతే బొప్పాయితో నయం చేస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అందుకోసం బొప్పాయి గింజలు రెండు భాగాలు, ఒక భాగం శొంఠి, కొద్దిగా ఉప్పు కలిపి చూర్ణంగా చేయాలి. ఈ చూర్ణాన్ని నిమ్మరసంతో కలిపి తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి.