Weight Loss: బ‌రువు త‌గ్గాలా.. ఇవి తిని చూడండి!

Hyderabad: సన్నగా నాజూగ్గా ఉండాలని అందరికీ ఉంటుంది. కానీ ఆధునిక జీవన శైలి, మారిన ఆహారపు అలవాట్ల వల్ల చిన్నతనం నుంచే అధిక బరువు(Obesity) సమస్య మొదలవుతోంది. శరీర బరువును నియంత్రించుకోవాలంటే(Weight loss) కొన్ని ఆహార నియమాలు పాటించక తప్పదు. అలాగే సరైన పోషక ఆహారం(Healthy Food) తీసుకోవడం ఎంత ముఖ్యమో, కొన్నిరకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. బరువు తగ్గడానికి ప్రయత్నించేవాళ్లు అల్పాహారంగా ఏయే పదార్థాలు తీసుకోవాలో, ఏ పదార్థాలు తినకూడదో తెలుసుకుందాం..
* గుడ్లలో(Eggs) ప్రోటీన్(Protein)​ అధికంగా ఉంటుంది. వీటిని ఉదయాన్నే తీసుకుంటే రోజంతా కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరిచే కోలిన్​ని కూడా కలిగి ఉంటాయి. సాధారణ పెరుగు కంటే గ్రీక్​ యోగట్​లో ఎక్కువ ప్రోటీన్ మరియు తక్కువ చక్కెర ఉంటుంది. ఇది ప్రోబయోటిక్స్ కలిగి ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఓట్​ మీల్(Oat meal)​ తక్కువ కాలరీలు గల ఆహారం. దీనిలో అధికంగా ఉండే ఫైబర్​ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీనిలో పోషకాలు కూడా ఎక్కువే. బెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్స్​ ఎక్కువ. డ్రైఫ్రూట్స్​లో ప్రోటీన్​ పుష్కలంగా ఉంటుంది. వీటిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి శక్తినందిస్తాయి.
* వెయిట్​ లాస్​ డైట్​లో ఉన్నప్పుడు ముఖ్యంగా ప్రాసెస్​ చేసిన మాంసం. శాండ్​ విచ్​లు, చక్కెర కలిగిన ధాన్యాలు, పేస్ట్రీలు, వైట్​ బ్రెడ్​.. వంటి పదార్థాలను తినకూడదు. బేకరీ ఆహారానికి దూరంగా ఉంటూ తాజా పండ్లు, కూరగాయలు, డ్రైఫ్రూట్స్​ తింటూ ఆరోగ్యకరమైన పద్ధతిలో అధిక బరువును తగ్గించుకోవచ్చు.