భారత్ క్యాన్సర్‌కు రాజధానిగా ఎందుకు మారింది?
Cancer: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున అపోలో హాస్పిటల్స్ భారత్‌ను క్యాన్సర్‌కు రాజధానిగా ప్రకటించడం ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇందుకు కారణం భారత్‌లో క్యాన్సర్ కేసులు అమాంతం పెరిగిపోతుండడమే. భారతదేశంలో ప్రస్తుతం ఎక్కువ అవుతున్న వ్యాధులు ఏవన్నా ఉన్నాయంటే అవి..
మధుమేహం
రక్తపోటు (గుండె జబ్బులు)
డిప్రెషన్
క్యాన్సర్
మానసిక సమస్యలు
ఇవన్నీ ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రీ డయాబెటిస్, ప్రీ హైపర్‌టెన్షన్, మానసిక సమస్యలు యువతల్లో ఎక్కువగా ఉండటం కలవర పెడుతున్న అంశం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధి తీవ్రంగా వ్యాపిస్తోంది.
ఇందుకు కారణం మారుతున్న జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారానికి దూరమై సమయం లేక బయట తిళ్లు తినేయడం, సరిగ్గా నిద్రపోక ఒత్తిడికి గురవడమే ప్రధాన కారణాలుగా చెప్తున్నారు. ఒత్తిడిలో పడి సిగరెట్లు ఎక్కువగా తాగేస్తున్నారని ఫలితంగా గొంతు, నోరు, ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు. ఇప్పటికే భారతదేశం క్యాన్సర్‌ను పోరాడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. మూల కారణాలను కనుక్కుని వాటిపై దృష్టి పెడితే క్యాన్సర్ కేసులు తగ్గే అవకాశం ఉంది.