White Hair: ఒక్క వాష్‌తోనే తెల్ల జుట్టు మాయం..!

White Hair: తెల్ల జుట్టుతో బాధ‌ప‌డుతున్నారా? అయితే భార‌తీయ మార్కెట్‌లో దొరికే బెస్ట్ కెమిక‌ల్ ఫ్రీ హెయిర్ క‌ల‌ర్స్ గురించి ఈరోజు మ‌నం చెప్పుకుందాం. అంతేకాదు.. ఒక్క రోజులోనే తెల్ల జుట్టు న‌ల్ల‌గా మార్చే చిట్కా గురించి కూడా తెలుసుకుందాం.

జుట్టు తెల్ల‌బ‌డ‌టం అనేది కేవ‌లం వృద్ధుల స‌మస్యే కాదు..ఐదుగురు టీనేజ‌ర్ల‌లో ఒక‌రు తెల్ల జుట్టు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇందుకు జీన్సే కాకుండా ఇంకా చాలా కార‌ణాలు ఉండొచ్చు. స‌రైన ఆహార ప‌దార్థాలు తీసుకోవ‌డం, సిగ‌రెట్, ఒత్తిడి, టెన్ష‌న్ వ‌ల్ల జుట్టు తెల్ల‌బ‌డిపోతుంది. ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోవ‌డం వ‌ల్ల జుట్టు న‌ల్ల‌బ‌డే ఛాన్స్ ఉంద‌ని మ‌న అంద‌రికీ తెలుసు. కానీ అప్ప‌టిక‌ప్పుడు మ‌నకు రిజ‌ల్ట్ కావాలి కాబ‌ట్టి జుట్టుకు రంగేసుకోవ‌డం వంటివి చేస్తుంటాం. (White Hair)

మ‌న‌కు భార‌తీయ మార్కెట్ల‌లో ఎన్నో హెయిర్ క‌ల‌ర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే మ‌హిళ‌లకు ఒక ర‌కంగా, పురుషుల‌కు ఒక రకంగా క‌ల‌ర్లు ఉంటాయ‌ని ప్ర‌క‌ట‌న‌లు వేస్తుంటారు. అందులో ఎంత మాత్రం నిజంలేదు. ఇప్పుడు మ‌నం మార్కెట్‌లో చూస్తున్న పాపుల‌ర్ బ్రాండ్స్ అన్నీ కూడా మ‌న జుట్టుకి స‌రైన రంగుని ఇచ్చినా ఇవ్వ‌క‌పోయినా అందులో వాడే కెమిక‌ల్స్ మాత్రం జుట్టుకు ఎంతో హానిని క‌లిగిస్తున్నాయి. ఇలాంటి రంగుల ప్యాకెట్లలో మిన‌ర‌ల్ ఆయిల్, స‌ల్ఫేట్, హైడ్రోజ‌న్ పెరాక్సైడ్ వంటి హానికారక కెమిక‌ల్స్ ఉంటాయి.

వీటిని పూసుకోవ‌డం వ‌ల్ల క‌ల‌ర్ చేసుకోవ‌డానికి ఇక జుట్టు కూడా ఉండ‌క‌పోవ‌చ్చు. క‌చ్చితంగా జుట్టు రాల‌డం, దుర‌ద‌, ఎల‌ర్జీ వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. స్వ‌యంగా ఈ కంపెనీలే ఈ ప్యాకెట్ల‌పై స్కిన్ ఇరిటేటింగ్ కెమికల్స్ ఉన్నాయ‌ని ప్యాకెట్ల‌పై వార్నింగ్ కాష‌న్ ఇస్తున్నారు. ఇక నేచుర‌ల్ హెయిర్ క‌ల‌ర్స్ పేరుతో కూడా తెగ మార్కెటింగ్ చేస్తున్నారు. ఇలాంటి నేచుర‌ల్ అని రాసున్న ప్యాకెట్ల‌పై ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూస్తే షాక్ అవ్వ‌డం ఖాయం. ఎందుకంటే కేవ‌లం యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ మాత్ర‌మే పేర్కొని హానికార‌మైన కెమిక‌ల్స్‌ని మాత్రం వాడిన‌ట్లు చెప్ప‌కుండా క‌స్ట‌మ‌ర్ల‌ను మోసం చేస్తుంటారు.

మ‌రి భార‌తీయ మార్కెట్‌లో కెమిక‌ల్స్ లేని.. రోజూ జుట్టుకు రంగు వేసుకోగ‌లిగే హెయిర్ క‌ల‌ర్స్ ఉన్నాయా అంటే క‌చ్చితంగా ఉన్నాయి. బ‌యోటిక్, వెజిట‌ల్, ఖాది బ్రాండ్ల‌కు చెందిన హెయిర్ క‌లర్స్ అన్నీ కూడా నేచుర‌ల్‌గా త‌యారుచేయ‌బ‌డిన‌వి. ఈ బ్రాండ్స్ త‌మ పూర్తి ఇంగ్రీడియంట్ లిస్ట్‌ని కూడా ప్యాకెట్ల‌పై ప్ర‌చురిస్తాయి. ఇప్పుడున్న భార‌తీయ మార్కెట్‌లో ఈ హెయిర్ క‌ల‌ర్స్ బెస్ట్ అని చెప్ప‌వ‌చ్చు. ఇవి ఆడ‌వారికే కాదు మ‌గ‌వారు కూడా చ‌క్క‌గా వాడుకోవ‌చ్చు.

సింపుల్ చిట్కా

ఈ సింపుల్ చిట్కా వ‌ల్ల ఎక్కువ‌గా ఖ‌ర్చు చేయ‌కుండా జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు. పూర్వం ప్రొడ‌క్టులు మార్కెట్‌లోకి రాక‌ముందు ఇంట్లోనే తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చుకునేవారు. గోరింటాకు, ఇండిగో ఆకుల‌ను స‌రైన ప‌ద్ధ‌తిలో ఉప‌యోగిస్తే మీ జుట్టు ఒక్క వాష్‌లోనే న‌ల్ల‌గా మారుతుంది.  ఆయుర్వేద గ్రంథాల‌లో కూడా దీని గురించి వివ‌రించారు. ఈ చిట్కాను పాటించేందుకు ముందుగా ఒక గిన్నెలో రెండు స్పూన్ల మెహందీ పౌడ‌రు తీసుకోండి. కాస్త నీళ్లు క‌లిపి పేస్ట్‌లా క‌ల‌పండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని మూత పెట్టి 12 గంట‌లు వ‌దిలేయండి.

12 గంట‌ల త‌ర్వాత చూస్తే మెహెందీ పేస్ట్ రంగు కాస్త బ్రౌన్ రంగులోకి మారుతుంది. ఇప్పుడు ఈ పేస్ట్‌లో కాస్త ఇండిగో పౌడ‌రు యాడ్ చేయండి. ఇండిగో పౌడరు మీకు ఆన్‌లైన్ కూడా దొరుకుతుంది. మీరు ఎంత మెహెందీ పౌడ‌రు తీసుకుంటే దానికి రెట్టింపు ఇండిగో పౌడ‌రు వేయండి. కాస్త వేడి నీళ్లు క‌లిపి ఒక పేస్ట్‌లా త‌యారుచేసుకోండి. పేస్ట్ రెడీ అయ్యాక తెల్ల వెంట్రుక‌ల‌పై అప్లై చేసుకోండి. నాలుగు గంట‌ల పాటు వ‌దిలేసి కేవ‌లం నీళ్ల‌తో క‌డిగేయండి. ఆ త‌ర్వాత త‌ల‌కు నూనె రాసి మ‌రుస‌టి రోజు షాంపూ చేసుకోండి. మ‌రుస‌టి రోజే జుట్టు న‌ల్ల‌గా మారిపోతుంది. కావాలంటే ప్ర‌య‌త్నించి చూడండి.