అక్కడ దురద.. లైంగిక ఇన్‌ఫెక్షనే కారణమా?
Anal Itching: కొందరికి మలవిసర్జన చేసే భాగంలో దురదగా ఉంటుంది. దీనికి జీవనశైలిలో మార్పులు కూడా ఓ కారణం కావచ్చు. అలాగని నిర్లక్ష్యం చేయలేం. ఎందుకంటే కొన్నిసార్లు అది లైంగిక చర్యల వల్ల ఏర్పడిన ఇన్ఫెక్షన్లు (STI) కూడా కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి ఇన్‌ఫెక్షన్లను ఏనల్ హెర్పీస్ అంటారు. ఆ భాగంలో దురద, యోని దగ్గర నొప్పి, కురుపులు, మూత్రం పోస్తుంటే నొప్పిగా ఉండటం ఇవన్నీ ఏనల్ హెర్పీస్ లక్షణాలే. ఈ ఇన్‌ఫెక్షన్ ఏనల్ సెక్స్, సాధారణ సెక్స్ వల్ల వ్యాపిస్తుంది. ఇన్‌ఫెక్షన్ తీవ్రత ఎక్కువైతే యోని, అంగం దగ్గర పులిపిర్లు కూడా వస్తుంటాయి. ఈ పులిపిర్లు మొదట్లో పెద్దగా నొప్పి అనిపించదు కానీ మెల్లిగా ఎక్కువై యోగి, అంగం భాగం మొత్తానికి వ్యాపిస్తుంది. మెల్లిగా విపరీతమైన దురద, నొప్పి కూడా మొదలవుతుంది.
తలలో పేన్లు పట్టినట్లు కింది భాగంలోని అవాంచిత రోమాల మధ్య కొన్ని పురుగులు కూడా వస్తుంటాయట. ఈ లక్షణాలన్నీ లైంగికంగా వ్యాపించే ఇన్‌ఫెక్షన్ల వల్ల వస్తాయి.
దేని వల్ల ఈ రిస్క్ ఉంటుంది?
కండోమ్ లేకుండా సెక్స్ చేసినా..
చాలా మంది వ్యక్తులతో సెక్స్ చేసినా..
మద్యం, డ్రగ్స్ సేవించి సెక్స్ చేయడం.. దీని వల్ల మత్తులో కండోమ్ పెట్టుకోవడం మర్చిపోతుంటారు.