Breast Pain: వక్షోజాల నొప్పి ఎందుకొస్తుంది? కారణాలేంటి?
Breast Pain: చాలా మంది మహిళలకు వక్షోజాల నొప్పి ఉంటుంది. కొందరికి నెలసరి సమయానికి ముందు లేదా తర్వాత నొప్పి ఉంటే.. మరికొందరికి ఉన్నట్టుండి నొప్పి పెడుతుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? ఈ నొప్పి వెనకాల కారణాలేంటి? వంటి విషయాలు తెలుసుకుందాం.
*పీరియడ్ సమయంలో ఒంట్లోని హార్మోన్లలో మార్పులు ఉంటాయి కాబట్టి వక్షోజాలు నొప్పిగా అనిపిస్తాయి. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరోన్ హార్మోన్లలో అసమతుల్యత ఉంటే ఈ నొప్పి ఉంటుంది.
*వక్షోజాల్లో ఫైబ్రోసిస్టిక్ కణాలు ఉన్నా కూడా ఈ నొప్పి వస్తుంది.
*PCOS సమస్యతో బాధపడే వారికి కూడా వక్షోజాల్లో బాగా నొప్పి ఉంటుంది.
*ఎక్కువగా ఉప్పు తినడం వల్ల ఒంట్లో నీరు చేరి వక్షోజాలు కాస్త ఉబ్బినట్లుగా ఉండి నొప్పి పెడతాయి.
*వక్షోజాల వద్ద కండరాలపై ఎక్కువ ఒత్తిడి పడేలా వ్యాయామాలు వర్కవుట్స్ చేసినా నొప్పి పెడతాయి.
*ఎక్కువగా కెఫీన్ తీసుకున్నా కూడా వక్షోజాలు నొప్పిపెడతాయి. కెఫీన్ తగ్గిస్తే నొప్పి తగ్గుముఖం పడుతుంది.