Packet Milk: ప్యాకెట్ పాలు కాచాలా వ‌ద్దా?

should we boil packet milk

Packet Milk: అప్ప‌టిక‌ప్పుడు పితికిన పాలైనా.. ప్యాకెట్ పాలైనా మ‌నం కాచే తాగుతాం. కాచ‌ని పాల‌ను ప‌చ్చిగా తాగే వారు త‌క్కువ‌గా ఉంటారు. అలా కాచ‌కుండా తాగ‌కూడ‌ద‌ని కూడా చెప్తుంటారు. ప‌చ్చి పాల‌ల్లో హానికార‌క క్రిములు ఉంటాయ‌న్న కార‌ణంతో కాచి తాగ‌మ‌ని చెప్తుంటారు. అయితే మ‌నకు మార్కెట్‌లో వ‌స్తున్న పాలు ఆల్రెడీ స‌గం కాచి అమ్మేవే. దీనినే పాశ్చురైజ్డ్ మిల్క్ అంటారు. చాలా ప్యాకెట్ల‌పై ఇది రాసి ఉంటుంది. ఆల్రెడీ కాచి చ‌ల్లార్చి ప్యాకెట్ల‌లో పోసి అమ్ముతుంటారు. చాలా మంది ఇది తెలీక మ‌ళ్లీ కాచి తాగుతుంటారు. సాధార‌ణంగా పాలు కాస్తే అందులోని కీల‌క పోష‌కాలు పోతాయట‌. అయితే పాశ్చురైజ్డ్ పాల‌ని మాత్రం కాస్త వేడి చేసి తాగితే మంచిద‌ని చెప్తున్నారు. దీని వ‌ల్ల పాల‌ల్లో ఉన్న పోష‌కాలు కొంత‌వ‌ర‌కైనా మ‌న శ‌రీరానికి అందుతాయి.

ఎలాంటి పాలు కాచాలి?

మీరు నేరుగా పాలు అమ్మేవారి నుంచి పోయించుకునే మాటైతే కాచుకోవ‌చ్చు

స్కిమ్డ్, లో ఫ్యాట్ పాలు అని ప్యాకెట్‌పై రాసి ఉంటే గోరువెచ్చ‌గా వేడి చేసుకోవ‌చ్చు.

బాదం నుంచి తీసిన పాలు, సోయా పాలు కాచ‌కూడ‌దు. అవి నేరుగా తీసుకుంటేనే మంచిది