Health: ఒక్క చిట్కా.. పేగులు శుభ్రమైపోతాయ్..!
Health: ఉదయం లేవగానే మీ పొట్ట శుభ్రం అవ్వడంలేదా? మల విసర్జన సమయంలో ఫోర్స్ చేయాల్సి వస్తోందా? మల విసర్జన తర్వాత కూడా మీ పొట్ట సరిగ్గా క్లీన్ అవ్వనేట్లుగా అనిపిస్తోందా? అయితే ఈ చిట్కా మీ కోసమే. ఏం తినాలి? ఏం తినకుండా ఉంటే ఈ ప్రాబ్లం రాదు? ఎలాంటి తప్పులు చేస్తే ఈ సమస్యలు వస్తాయి? వంటి విషయాలను తెలుసుకుందాం.
ఆయుర్వేదం ప్రకారం మీకు మూత్రం పోయడానికి పడుతుందో అంతే సమయం మల విసర్జనకు పట్టాలి. కానీ ఈ కాలంలో ఇది అసాధ్యం అనే చెప్పాలి. అరగంట కూర్చున్నా మల విసర్జన అవ్వదు. బాగా ఫోర్స్ చేయాల్సి వస్తుంది. ఫోర్స్ చేసినా సంతృప్తికరంగా మలం బయటికి రాదు. ఇలాంటి లక్షణాలు మీకూ ఉంటే మీ పేగుల్లో వేస్ట్ పేరుకుపోతోంది. ఇది మీ పేగులను బలహీన పరుస్తుంది. నోటి నుంచి దుర్వాసన రావడం, గ్యాస్ పోయినప్పుడు భయంకరమైన వాసన రావడం, ఆహారం తినగానే పొట్ట ఉబ్బిపోవడం, ఆకలి మందగించడం, చర్మం డల్‌గా అయిపోవడం, జుట్టు రాలడం.. ఇవన్నీ లక్షణాలే. ఇవి పట్టించుకోకపోతే భవిష్యత్తులో పైల్స్, అల్సర్స్ వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే.. సమస్యను తెలుసుకుని మసులుకోవాలి. అంతేకానీ ఇష్టం వచ్చినట్లు ట్యాబ్లెట్లు వేసుకోవడం వంటివి చేయకండి. (Health)
ALSO READ: మధ్యాహ్నం నిద్రపోవడం మంచిది కాదా.. వైద్యులు ఏం చెప్తున్నారు?
అన్నింటి కన్నా ముందు మీరు ఫోకస్ చేయాల్సింది తాగుతున్న నీటిపై. తగిన మోతాదులో నీళ్లు తాగుతున్నట్లైతే మీ పేగుల్లో లిక్విడ్ కంటెంట్ కరెక్ట్‌గా ఉంటుంది. లిక్విడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటేనే మల విసర్జన సులువుగా అవుతుంది. సైన్స్ ప్రకారం మీరు ఎంత సులువుగా మల విసర్జన చేయగలుగుతారో దానిని బట్టి పేగుల్లో మీ మలం సాఫ్ట్‌గా ఉంటోందా లేదా గట్టిగా ఉంటోందా వంటి అంశాలను అంచనా వేయగలుగుతారు.
టీ, కాఫీ, కార్బోనేటెడ్ డ్రింక్స్, మద్యం ఈ నాలుగు డైర్యూటిక్ బేవరేజెస్. అంటే ఇవి లోపల ఉండే నీటిని ఎండగట్టేస్తాయి. ఫలితంగా పేగులు డ్రై అయిపోతాయి. వీటి అలవాటు మీకుంటే వెంటనే మానేయండి. ఉదయం లేవగానే టీ, కాఫీ బదులు వేడి నీళ్లు తాగండి. రోజంతా కుదిరినప్పుడల్లా గోరు వెచ్చని నీళ్లు తాగుతూ ఉండండి. చల్ల నీళ్లు తాగడం కూడా పేగులకు మంచిది కాదు. అల్పాహారం, లంచ్‌కి అరగంట ముందు ఎక్కువ నీళ్లు తాగండి. లంచ్ అయ్యాక ఒక గంట తర్వాత నీళ్లు తాగండి. వాటర్ ఎక్కువగా తాగాలంటే మీ డైట్లో తప్పనిసరిగా పండ్లు ఉండాలి. ద్రాక్ష, జామ, పండిన అరటిపండ్లు, బొప్పాయి, యాపిల్ ఎక్కువగా తీసుకుంటే పేగులు క్లీన్ అవుతాయి. ఉదయాన్నే ఒకేసారి పొట్ట క్లీన్ అయిపోతుంది. (Health)
మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. పీచు పదార్థం. చాలా సార్లు పాత మలం పేగులకు అంటుకుపోయి కొత్త మలం కూడా బయటికి రానివ్వదు. ఇలాంటి సమయంలో పీచు పదార్థం ఎంతో మేలు చేస్తుంది. ఇది పేగుల్లో అంటుకుపోయిన మలాన్ని బయటికి లాగేయడమే కాకుండా మలం క్వాంటిటీని పెంచుతుంది. డైట్లో పీచు తక్కువ అవుతోంది అంటే మీరు మైదా ఎక్కువగా తింటున్నారని అర్థం. ఇలాంటి పదార్థాలే పేగుల్లోకి చేరి అతుక్కుపోయి తేన్పులు వచ్చేలా చేస్తాయి. వివిధ రకాల ధాన్యాలతో తయారుచేసిన రోటీలను తింటే మంచిది. దీని వల్ల రోటీల్లో పీచు పదార్థం క్వాంటిటీ పెరుగుతుంది ఉంటుంది. పప్పుల విషయంలో కూడా పాలిష్డ్ కాకుండా అన్ పాలిష్డ్ పప్పులు తెచ్చుకోండి.
ఏ మహిళలైతే కొద్దిగా వ్యాయామం చేస్తారో వారికి మలబద్ధకం రాలేదని ఓ సర్వేలో తేలింది. కాబట్టి వ్యాయామం అనేది తప్పనిసరి. ప్రతిరోజూ వాకింగ్ చేసినా సరే మీకు ఎన్నో లాభాలు కలుగుతాయి. కానీ ఆయుర్వేదంలో ఒక వ్యాయామ ప్రక్రియ ఉంది. దీనిని ఎప్పుడైనా ఒక పది నిమిషాలు చేస్తే కడుపులో కదలికలు సులువుగా ఉంటుంది. ఈ వ్యాయామం పేరు కపల్ భాటి. మీ పొట్ట క్లీన్ అవ్వకపోతే ఈ కపల్ భాటిని వాయుముద్ర వేసి చేస్తే చాలా త్వరగా మల విసర్జన అవుతుంది. కపల్ భాటి ఆసనానికి సంబంధించిన వీడియోలు ఆన్‌లైన్‌లోనూ లభిస్తాయి.
ఈ చిట్కా పాటించండి
ఉదయం లేవగానే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీళ్లు తాగండి. ఆ తర్వాత ఒక గ్లాస్ నీళ్లు తీసుకుని అందులో ఒక స్పూన్ సోంపు వేయండి. నీరు సగానికి చేరే వరకు బాగా మరిగించండి. అది చల్లారాక అందులో ఒక స్పూన్ ఆముదం వేసుకుని నెమ్మదిగా తాగి చూడండి. ఆముదం ఒంట్లోకి చేరాక ఎక్కువ సేపు ఉండలేదు. మలం రూపంలో త్వరగా బయటికి వచ్చేస్తుంది. పేగుల్లో పేరుకుపోయిన వేస్ట్‌ని కూడా తొలగిస్తుంది. పేగులకు శుభ్ర పరుస్తుంది. ఈ చిట్కాను వారంలో ఒకసారి మాత్రమే ప్రయత్నించి చూడండి. సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించగలరు.