Body Fat: ఎలాంటి వ్యాయామం లేకుండా కొవ్వంతా క‌రిగిపోతుంది

now a new injection will be available in the market to reduce body fat

Body Fat: శ‌రీర కొవ్వును క‌రిగించేందుకు వ్యాయామాలు చేస్తూ కాస్త ఒళ్లు వంచాల్సిందే. నొప్పులు భ‌రించాల్సిందే. తిని కూర్చుని దానంత‌ట అదే క‌రిగిపోతుందంటే కుద‌ర‌దు. ఇప్పుడు వైద్యులు ఎలాంటి వ్యాయామాలు చేయ‌క‌పోయినా క‌నీసం వాకింగ్ అన్నా రోజూ చేస్తుండాలి అని హెచ్చ‌రిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ భార‌త‌దేశంలో దాదాపు 50 శాతం మంది జ‌నాభా క‌నీస వ్యాయామాలు కూడా చేయ‌కుండా ఒకే చోట కూర్చుండిపోతున్నార‌ని ఓ స‌ర్వేలో తేలింది.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఒక ఇంజెక్ష‌న్ హాట్ టాపిక్‌గా మారింది. ఆ ఇంజెక్ష‌న్ పేరు టిర్జిపాటైడ్. ఈ ఇంజెక్ష‌న్ వారానికి ఒక‌సారి వేసుకుంటే ఒంట్లో కొవ్వంతా కొవ్వ‌త్తిలా క‌రిగిపోవ‌డమే కాదు మ‌ధుమేహం కూడా కంట్రోల్‌లో ఉంటుంద‌ట‌. ఆల్రెడీ ఈ ఇంజెక్ష‌న్‌తో రీసెర్చ్ కూడా మొద‌లుపెట్టేసారు. ఈ ఇంజెక్ష‌న్ వేసిన వారికి దాదాపు 20 శాతం ఒంట్లోని కొవ్వంతా క‌రిగిపోతోంద‌ట‌. వారి బ్ల‌డ్ షుగ‌ర్ కూడా అదుపులో ఉంటోంద‌ట‌. ప్ర‌స్తుతం ఈ ఇంజెక్ష‌న్‌ను చాలా దేశాల్లో డ‌యాబెటిస్‌ను త‌గ్గించేందుకు వాడుతున్నారు. ఇప్పుడు భార‌త్ కూడా ఈ ఇంజెక్ష‌న్‌ను మార్కెట్‌లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.