Health: 30ల్లో ఈ అల‌వాట్లు వ‌దిలేయాల్సిందే..త‌ప్ప‌దు..!

Health: 30 ఏళ్లు వ‌చ్చాయంటే ఆరోగ్యం విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతో ఉంది. 20ల్లో బాగానే ఎంజాయ్ చేసేస్తారు.. ఏది ప‌డితే అది తినేస్తూ వ్యాయామాలు చేయ‌కుండా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటారు. కానీ 30ల్లో అలా కుద‌ర‌దు. క‌చ్చితంగా ఆహారం విష‌యంలో నియ‌మాలు పాటించాలి. శారీర‌క మాన‌సిక ఆరోగ్యం విష‌యంలో ఎంతో అప్రమ‌త్తంగా ఉండాలి.

30 ఏళ్లు వ‌చ్చిన వారు.. లేదా ఆల్రెడీ 30ల్లో ఉన్న‌వారు ఈ అలవాటు మానేయండి

ఇప్పుడున్న డిజిట‌ల్ ప్ర‌పంచంలో సోష‌ల్ మీడియాలోనే స‌గం కాలం గ‌డిపేస్తున్నారు. దాని వ‌ల్ల తాత్కాలిక ఆనందం, ఉప‌శ‌మ‌నం క‌లుగుతుందే త‌ప్ప జీవితంలో అస‌లైన ఆనందాల‌ను అందుకోలేం. అందుకే కాస్త సోష‌ల్ మీడియాను ప‌క్క‌న పెట్టి మీ స్కిల్స్ పెంచుకోవడంపై లేదా ప‌ర్స‌న‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌పై ఫోక‌స్ చేయండి. లాంగ్ ట‌ర్మ్ హాబీల‌ను అల‌వ‌ర్చుకునేందుకు య‌త్నించండి.

కొన్ని సార్లు రిస్క్ తీసుకోక‌పోవ‌డ‌మే జీవితంలో మ‌నం చేసే అతిపెద్ద రిస్క్. 20ల్లో ఏదో భ‌య‌ప‌డి రిస్క్ తీసుకోక‌పోతే లైట్ తీస్కోండి. కానీ 30ల్లో కూడా అలాగే ఉంటే కుద‌ర‌దు. కొన్నిసార్లు రిస్క్ తీసుకుంటేనే మ‌నం కోరుకున్న జీవితం ద‌క్కుతుందేమో..! ఒక‌సారి ఆలోచించండి. కాక‌పోతే మీరు తీసుకునే రిస్క్‌లు ఆచి తూచి వ్య‌వ‌హ‌రించే విధంగా ఉండాలి. ఏదో రిస్క్ తీసుకోమ‌న్నారు క‌దా అని ఆలోచించ‌కుండా చేసేస్తే మాత్రం మొద‌టికే మోసం వ‌స్తుంది.

ఏదైనా స‌మ‌స్య వ‌స్తే ఇత‌ర అంశాల వ‌ల్లే ఆ స‌మ‌స్య వ‌చ్చింద‌ని ఆలోచించ‌డం మానేయాలి. మీ వ‌ల్లే వ‌చ్చిన స‌మ‌స్య‌ను కూడా ఇత‌రుల‌పై లేదా ఇత‌ర అంశాల‌పై తోసేయ‌కూడ‌దు. దీనిని బాధ్య‌త‌గా తీసుకుని ఇంకోసారి ఇలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌కుండా చూసుకునే మైండ్ సెట్‌ను బిల్డ్ చేసుకోండి. ఏం చేసినా 100% ప‌ర్‌ఫెక్ట్‌గా ఉండాలి అనుకుంటే పొర‌పాటే. మీకు అన్నీ ప‌ర్‌ఫెక్ట్‌గా ఉండాలంటే కొన్నిసార్లు కుద‌ర‌దు. అందుక‌ని ఆగిపోకండి. నెమ్మ‌దిగా మన ప‌ని మ‌నం చేసుకుంటూ పోతే ప‌ర్ఫెక్ష‌న్ అదే వ‌స్తుంది.

నిజానికి ఈ అల‌వాటు 20ల్లోనే అల‌వ‌ర్చుకోవాలి. కానీ ఇప్పుడున్న జీవ‌న శైలిలో ఇలాంటి అల‌వాట్లు ఉండ‌టం చాలా క‌ష్టం. క‌ష్టం అని లైట్ తీసుకోలేం క‌దా..! అందుకే ఇక నుంచైనా మొద‌లుపెట్టండి. 30 ఏళ్లు రాని వారు కూడా ఈ అల‌వాట్ల‌ను అల‌వ‌ర్చుకోవ‌చ్చు.