Clear Skin: రాత్రికి రాత్రే మెరిసిపోయే చర్మం కోసం..
Clear Skin: మన శరీరంలోని ఇతర అవయవాలతో పోల్చుకుంటే మన చర్మం (Skin) సెన్సిటివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. అలాగని మార్కెట్‌లో దొరికే అన్ని క్రీములను వాడటం కూడా మంచిది కాదు. చలికాలం బాగానే ఉంటుంది. కానీ స్కిన్‌కి మాత్రం టఫ్ సమయం. చల్లటి గాలులు హ్యుమిడిటీ చర్మంలోని తేమను లాగేసుకుంటాయి. అందుకే చలికాలంలో నిర్జీవంగా తయారవుతుంది. విపరీతమైన కాలుష్యం, ఎండ వల్ల మన స్కిన్ దాని సహజ స్కిన్ టోన్‌ని కోల్పోయి డార్క్ అయిపోతుంది.
ALSO READ: నల్లమచ్చలా.. కలబందతో విముక్తి
ఒకవేళ ఫెయిర్‌నెస్ క్రీంలను వాడితే కేవలం మీ సమయం, డబ్బు ఖర్చు చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. అప్పటికప్పుడు పార్టీలకు ఫంక్షన్లకు వెళ్లాలంటే రెడీమేడ్ క్రీంలు వాడితే ఓకే కానీ.. మరీ రోజూ ఇవి వాడితే చికిత్సలు చేయించుకున్నా తగ్గని చర్మ సమస్యలు వస్తాయి. మరి ఏం చేయాలి? మెరిసిపోయే చర్మం మన సొంతం అవ్వాలంటే ఏం చేయాలి? సింపుల్‌గా ఈ చిట్కాలు ఫాలో అయిపోండి. ఈ చిట్కాలు పురుషులకు కూడా ఉపయోగపడతాయి.
హోం మేడ్ క్రీం కోసం ఇలా చేయండి
ముందుగా ఒక స్పూన్ గ్లిజరిన్ (Glycerin) తీసుకోండి. గ్లిజరిన్ చర్మానికి తేమ అందిస్తుంది. పొడి చర్మాన్ని తొలగిస్తుంది. ఇది యాంటీ మైక్రోబియల్ కాబట్టి ప్రమాదకరమైన బ్యాక్టీరియా నుంచి కాపాడుతుంది. చర్మాన్ని మెత్తగా ఉంచుతుంది. ఇది అన్ని మెడికల్ షాపుల్లో లభిస్తుంది. ఒక స్పూన్ రోజ్ వాటర్ (Rose Water) తీసుకోండి. రోజ్ వాటర్‌ని కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇంటి చిట్కాల్లో వాడుతూ వస్తున్నారు.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం నుంచి సహజమైన మెరుపును సంతరించుకుంటుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కూడా. యాక్నేను కూడా తగ్గిస్తుంది. చివరగా ఒక స్పూన్ నిమ్మరసం. నిమ్మలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల పాడైపోయిన చర్మ కణాలను రిపేర్ చేస్తుంది. అంతే కాదు ముఖంపై ముడతలు, మరకలను కూడా తగ్గిస్తుంది. ఈ మూడు పదార్థాలను సమానంగా తీసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి.
ALSO READ: Castor Oil: నాభికి ఆముదం.. లాభాలు అనేకం
రాత్రి పడుకునే ముందు ముఖం కడుక్కున్నాక ఒక దూది ఉండ తీసుకుని ఈ మిశ్రమాన్ని ముఖానికి పూర్తిగా రాసుకోవాలి. ఇంకేముంది.. హాయిగా పడుకోండి. ఈ పవర్‌ఫుల్ కాంబినేషన్ మీ ఫేస్‌పై తన పని తాను చేసుకుని పోతుంది. మరుసటి ఉదయం మీ ముఖంపై ఫలితాలు చూసి కచ్చితంగా షాక్ అవుతారు. మీ ముఖం బాగా నిగనిగలాడుతూ ఉంటుంది. ఇలా ఎందుకంటే.. ఈ మూడు పదార్థాలు మీకు కనపడని మురికిని ముఖం నుంచి పూర్తిగా తొలగించేస్తాయి. అంతేకాదు.. ఈ మూడు పదార్థాలు మీకు సులువుగా మార్కెట్‌లో లభిస్తాయి.
ఈ హోం మేడ్ నైట్ క్రీంని ప్రతి రోజూ రాత్రి అప్లై చేసుకుని పడుకోవచ్చు. ముఖ్యంగా చలికాలంలో అయితే చాలా ఉపయోగపడుతుంది. కావాలంటే ఈ మూడు పదార్థాలను కలిపి ఒక గ్లాస్ బాటిల్‌లో వేసి వారం రోజులు ఉంచుకోవచ్చు. అయితే పదార్థాలు మాత్రం సమానంగా ఉండాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకూడదు. ఫలితాలు వస్తాయా రావా అనే అనుమానం కూడా అవసరం లేదు. ఒకవేళ మీకు గ్లిజరిన్, నిమ్మరసం, రోజ్‌వాటర్‌లలో ఏ ఒక్క పదార్ధం వల్ల అయినా అలెర్జీ ఉంటే మీరు వాడాల్సిన అవసరం లేదు. లేదా ఓ మంచి డెర్మటాలజిస్ట్‌ని సంప్రదించి నిర్ణయం తీసుకోండి.