Health: డైట్, వ్యాయామం లేకుండా బరువు తగ్గడం ఎలా?
Health: బరువు తగ్గాలి. కానీ వ్యాయామం చేయలేం.. సరైన డైట్ తీసుకోలేం. మరి బరువు తగ్గడం ఎలా? ఈ టిప్స్ పాటిస్తే డైట్, వ్యాయామం లేకుండానే బరువు తగ్గొచ్చట.
మీరు తింటున్న ఆహారాన్ని గబగబా మింగేయకుండా బాగా నమిలి తినాలి. ఒక్కో ముద్దను దాదాపు 15 సార్లు నమిలి మింగాలి. ఇలా తింటే కడుపు త్వరగా నిండిన భావం కలుగుతుంది. ఎక్కువ కేలొరీలు కూడా లోపలికి వెళ్లవు.
చిన్న ప్లేట్లలో భోజనం పెట్టుకుని తినండి. చిన్న ప్లేట్లు వాడితే మీరు ఒకవేళ భోజనం ఎక్కువగా వడ్డించుకుంటే అమ్మో ఎక్కువ తినేస్తున్నాం అనే భావన కలుగుతుందట. చిన్న ప్లేట్లలో పెట్టుకుని తినడం వల్ల తక్కువగానే తింటారు.
మీరు ఏం తింటున్నా కూడా అందులో ప్రొటీన్ ఉండేలా చూసుకోండి. ప్రొటీన్ తింటూ ఉండటం వల్ల ఆకలి ఎక్కువ వేయదు. బరువు కూడా తగ్గుతారు.
మీకు ఏం తినాలనిపించినా ఇంట్లోనే చేసుకుని తినేందుకు ప్రయత్నించండి. బయటి ఫుడ్స్ జోలికి అస్సలు వెళ్లద్దు.
మీరు తినే వాటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండేలా చూసుకోండి. పీచు ఎక్కువగా తీసుకుంటే పేగుల్లో జిగురు ఏర్పడి నిదానంగా డైజెస్ట్ అవుతుంది. డైజెషన్ నిదానంగా ఉంటే ఆకలి వేయదు. మలబద్ధకం దరిచేరదు.
తినడానికి ముందు ఒక గ్లాస్ నీళ్లు తాగండి. దీని వల్ల ఎక్కువగా తినలేరు. ఫలితంగా తక్కువ కేలొరీలు వెళ్తాయి.
తినేటప్పుడు మైండ్‌ఫుల్‌గా ఉండాలి. అంటే తినేటప్పుడు టీవీ చూడటం.. ఇతరులతో మాట్లాడుతూ తినడం వంటివి చేయద్దు. ప్రతి ముద్దను ఆస్వాదిస్తూ తినండి. అప్పుడే ఎంత తింటున్నాం ఏం తింటున్నాం అనేది తెలుస్తుంది.
మీరు ఎంత మంచి ఆహారం తీసుకుంటున్నా నిద్ర సరిగ్గా లేకపోతే బరువు తగ్గే అంశంపై ప్రభావం చూపదు. 7 నుంచి 8 గంటల నిర్విరామ నిద్ర ఉండి తీరాల్సిందే అని గుర్తుపెట్టుకోండి.