Relationship: బంధంలో ఫిజిక‌ల్ ట‌చ్ అవ‌స‌ర‌మా?

Relationship: ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు పార్ట్‌న‌ర్ చెయ్యి త‌గిలినా ఒళ్లంతా పుల‌కించిన‌ట్లు ఉంటుంది. వారిని హ‌గ్ చేసుకోవాల‌ని.. చేతిలో చెయ్యి వేసి న‌డ‌వాల‌ని ప్రేమ‌లో ఉన్న ప్ర‌తీ ఒక్క‌రు కోరుకుంటారు. ఆ ఫిజిక‌ల్ ట‌చ్‌లో ఉన్న మ్యాజిక్ అదే..! అయితే.. అస‌లు ప్రేమ బంధంలో ఈ ఫిజిక‌ల్ ట‌చ్ అనేది అవ‌స‌రమా? ఒక‌వేళ అవ‌స‌రం అయితే ఎంత వ‌ర‌కు ఉండాలి? అనే అంశాల‌పై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

ఫిజిక‌ల్ ట‌చ్ అంటే ఏంటి?

ఫిజిక‌ల్ ట‌చ్ అంటే ఈ త‌రం వారు ప్రేమ పేరుతో చేసే నీచ‌పు ప‌నులు కాదు. నిజంగానే ఒక‌రంటే ఒక‌రికి ఇష్టం ఉన్న‌ప్పుడు పార్ట్‌న‌ర్ బాధ‌లో ఉన్న‌ప్పుడు చేయ్యి ప‌ట్టుకుని ఏమీ మాట్లాడ‌క‌పోయినా నేనున్నా అనే ధైర్యాన్ని ఇచ్చేదానిని ఫిజిక‌ల్ ట‌చ్ అంటారు. ఈ ఫిజిక‌ల్ ట‌చ్ అనేది ఇద్ద‌రి మ‌ధ్య ఒక‌రంటే ఒక‌రికి ఎంత న‌మ్మ‌కం ఉందో తెలియ‌జేస్తుంది. ప్రేమ, న‌మ్మ‌కం రెట్టింప‌య్యేలా చేస్తుంది.

మీ పార్ట్‌న‌ర్ ఏద‌న్నా బాధ‌లో ఉన్నార‌నుకోండి.. వారి ప‌క్క‌న కూర్చుని భుజం త‌ట్టండి.. లేదా ఏమీ కాదు అంతా మంచే జ‌రుగుతుంది అనే న‌మ్మ‌కాన్ని ఇస్తున్న‌ట్లు వారి చెయ్యిపై చెయ్యి వేసి చూడండి.. ఆ ఫిజిక‌ల్ ట‌చ్‌లో ఉన్న మ్యాజిక్ మీకే తెలుస్తుంది. కొన్నిసార్లు ఏమీ మాట్లాడ‌లేక‌పోయినా మ‌నం చూపించే ఫిజిక‌ల్ ట‌చ్‌తోనే అన్ని విష‌యాలు మాట్లాడేసిన‌ట్లు ఉంటుంది. ఫిజిక‌ల్ ట‌చ్ అనేది భ‌యాన్ని పోగొట్టేలా ధైర్యాన్ని ఇచ్చేలా ఉండాల‌ని నిపుణులు చెప్తున్నారు.

నిపుణులు చేసిన ప‌రిశోధ‌న‌ల‌లో తేలిన అంశాల‌ను మీతో షేర్ చేసుకోవ‌డం జ‌రిగింది. ఇందులో వ్య‌క్తిగ‌త అంశాలు ఏవీ లేవు అనే విష‌యాన్ని గ‌మ‌నించ‌గ‌ల‌రు